News October 10, 2025

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

image

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటు చేసిన సదరం క్యాంపును శుక్రవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దివ్యాంగుల పెన్షన్ కోసం రీ అసెస్మెంట్‌లో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు సదరం క్యాంప్ పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రోగులతో ఆప్యాయంగా మాట్లాడి సేవలందించాలని కలెక్టర్ తెలిపారు. ఇక్కడికి వచ్చిన వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Similar News

News October 11, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 11, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.19 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 11, 2025

పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిశీలించిన చిత్తూరు ఎస్పీ

image

చిత్తూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎస్పీ తుషార్ డూడీ శుక్రవారం పరిశీలించారు. త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుల్‌లకు శిక్షణ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గదులు పరిశుభ్రంగా గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు.

News October 11, 2025

త్వరలో నెల్లూరులో అధునాతన కూరగాయల మార్కెట్

image

నెల్లూరులో అధునాతన వసతులతో అతిపెద్ద కూరగాయల మార్కెట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ నుంచి జీవో విడుదలైంది. నవాబుపేట సమీపంలోని నరుకూరు రోడ్డులో ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డులో నెల్లూరు నగరపాలక సంస్థ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ మార్కెట్‌ను పీపీపీ విధానంలో నిర్మించనున్నారు. మొత్తం 19.69 ఎకరాలలో మార్కెట్ ఏర్పాటు కానుంది.