News April 7, 2024

చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమైనా గుర్తొస్తుందా?: సీఎం జగన్

image

చంద్రబాబు పేరు చెబితే ఒక పథకమైనా గుర్తొస్తుందా అంటూ ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రశ్నించారు. ‘మేనిఫెస్టోను 99శాతం అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. సంక్షేమం చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టారు. ప్రతి సంక్షేమ పథకంలో మీ బిడ్డ కనిపిస్తాడు. వాలంటీర్లను చంద్రబాబు ఆంబోతులంటూ కించపరిచాడు. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబుది’ అని పేర్కొన్నారు.

Similar News

News October 9, 2024

నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ప్రక్షాళన: పవన్

image

AP: విజయవాడ పరిధిలో బుడమేరు ప్రక్షాళనను పద్ధతిగా చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ముందుగా నిర్వాసితుల్లో అవగాహన పెంచుతామని చెప్పారు. నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని పేర్కొన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీనిచ్చారు.

News October 9, 2024

రాష్ట్రంలో పండుగ వాతావరణం లేదు: KTR

image

TG: రాష్ట్రంలో పండుగ వాతావరణం కనపడటం లేదని KTR అన్నారు. ‘ఆడబిడ్డలకు చీరలు లేవు. రైతులకు రైతుబంధు లేదు. ఆఖరికి బతుకమ్మ ఆడేందుకు డీజేలు కూడా లేవు. ఏ అధికారి తమ ఇంటికి వచ్చినా ఇల్లు కూల్చేస్తారని ప్రజలు భయపడుతున్నారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకే మూసీ ప్రక్షాళన అంటున్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ హామీ ఇచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకం ఏమైంది? వీటిపై అందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

News October 9, 2024

వరద సాయం కోసం ₹601కోట్ల ఖర్చు: మంత్రి

image

AP: రాష్ట్రంలో వరద బాధితులకు సాయం చేయడానికి మొత్తం ₹601కోట్లు ఖర్చయిందని మంత్రి నారాయణ వెల్లడించారు. ‘ఆహారానికి ₹92.5కోట్లు, తాగునీటికి ₹11.2Cr, మెడికల్ కేర్‌కు ₹4.55Cr, పారిశుద్ధ్యానికి ₹22.56Cr ఖర్చయింది. ఎన్టీఆర్ జిల్లాలో ₹139.44Cr.. ఇలా మొత్తం ₹601కోట్లు ఖర్చు పెట్టాం. వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతే ఆదుకోకుండా ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.