News October 10, 2025

రావికమతం: ‘జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాలకు వైద్యాధికారుల నియామకం’

image

జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు సమ్మెలో లేని కాంట్రాక్టు వైద్యులను సర్దుబాటు చేశామని DM&HO హైమావతి శుక్రవారం తెలిపారు. పిచ్చికుక్క కరిచిన విద్యార్థుల ఆరోగ్యంపై సమీక్షించేందుకు శుక్రవారం రావికమతం వచ్చారు. వైద్యాధికారులు సమ్మెలో ఉన్నందున ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఒక వైద్యుడు విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 46 PHCలు, 9 CHCలలో వైద్య సేవలకు అంతరాయం లేదని చెప్పారు.

Similar News

News October 11, 2025

అఫ్గాన్‌ను భారత్ టెర్రర్ బేస్‌గా వాడుతోంది: పాక్

image

భారత్-అఫ్గాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ DG అహ్మద్ షరీఫ్ ఇండియాపై దారుణమైన ఆరోపణలు చేశారు. ‘పాక్‌లో టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కోసం అఫ్గాన్‌‍ను భారత్ ఒక ఉగ్రవాద స్థావరంగా వాడుకుంటోంది. అఫ్గాన్‌లో ఇతరులకు చోటివ్వడం కేవలం పాక్‌కే కాదు.. సౌదీ, UAE, చైనా, US, తుర్కియే దేశాలకూ ప్రమాదమే’ అని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు ‘ది డాన్’ నివేదికలో పేర్కొంది.

News October 11, 2025

పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

రెవెన్యూకు సంబంధించిన పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి, సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులను జాగ్రత్తగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

News October 11, 2025

వారిపై నిఘా ఉంచండి: గుంటూరు రేంజ్ IG

image

రానున్న దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు దీపావళి భద్రతపై అవగాహన కల్పించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులతో ఐజీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ఆర్థికనేరాలలో టాప్ 10 ముద్దాయిలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. రాత్రీ పగలు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.