News October 10, 2025

బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ దేశానికే ఆదర్శం: CM

image

వెంకటాచలం(M) ఈదగాలిలో ఏర్పాటు చేసిన బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ద్వారా 200 లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ఇదొక ఇన్నోవేటివ్ ప్రాజెక్టు అని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ తరహా ఆలోచనలను అందిపుచ్చుకోవడం గొప్ప విషయమన్నారు. వినూత్నంగా కరెంటును ఉత్పత్తి చేసే విధానానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు.

Similar News

News October 11, 2025

త్వరలో నెల్లూరులో అధునాతన కూరగాయల మార్కెట్

image

నెల్లూరులో అధునాతన వసతులతో అతిపెద్ద కూరగాయల మార్కెట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ నుంచి జీవో విడుదలైంది. నవాబుపేట సమీపంలోని నరుకూరు రోడ్డులో ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డులో నెల్లూరు నగరపాలక సంస్థ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ మార్కెట్‌ను పీపీపీ విధానంలో నిర్మించనున్నారు. మొత్తం 19.69 ఎకరాలలో మార్కెట్ ఏర్పాటు కానుంది.

News October 10, 2025

త్వరలోనే నెల్లూరు జిల్లాకు మహర్ధశ: CM

image

కృష్ణపట్నంతో పాటు త్వరలోనే రామాయపట్నం, దుగ్గరాజపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా దగదర్తి ఎయిర్ పోర్ట్ పూర్తయితే జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వస్తాయని, దీని వలన పేదరికం తగ్గే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే HYD-చెన్నై, చెన్నై-అమరావతికి బుల్లెట్ ట్రైన్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2047 కల్లా AP ఆర్థికంగా అగ్రస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.

News October 10, 2025

కాసేపట్లో బయో ఎనర్జీ ఇథనాల్‌ ప్లాంట్‌ను ప్రారంభించనున్న CM

image

CM చంద్రబాబు శుక్రవారం వెంకటాచలం మండలం చేరుకున్నారు. ఈదగాలి గ్రామంలోని నందగోకులం లైఫ్ స్కూల్‌లో పర్యటించారు. అనంతరం సమీపంలోని గోశాలను సందర్శించి, నంది పవర్‌ ట్రెడ్‌ మిల్‌ మిషన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. ఆయన వెంట ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు.