News October 10, 2025

APPLY NOW : చిత్తూరులో 56 ఉద్యోగాలు

image

AP: చిత్తూరు DHMO 56 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, MBBS, CA, Mcom, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Similar News

News October 11, 2025

అక్టోబర్ 11: చరిత్రలో ఈ రోజు

image

1902: లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జననం
1922: సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు జననం
1942: సినీ నటుడు అమితాబ్ బచ్చన్ జననం
1947: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేష్ జననం
1972: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ జననం
1993: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య జననం
1997: సినీ, నాటక, రచయిత గబ్బిట వెంకటరావు మరణం
✯ అంతర్జాతీయ బాలికా దినోత్సవం

News October 11, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 11, 2025

అఫ్గాన్‌ను భారత్ టెర్రర్ బేస్‌గా వాడుతోంది: పాక్

image

భారత్-అఫ్గాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ DG అహ్మద్ షరీఫ్ ఇండియాపై దారుణమైన ఆరోపణలు చేశారు. ‘పాక్‌లో టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కోసం అఫ్గాన్‌‍ను భారత్ ఒక ఉగ్రవాద స్థావరంగా వాడుకుంటోంది. అఫ్గాన్‌లో ఇతరులకు చోటివ్వడం కేవలం పాక్‌కే కాదు.. సౌదీ, UAE, చైనా, US, తుర్కియే దేశాలకూ ప్రమాదమే’ అని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు ‘ది డాన్’ నివేదికలో పేర్కొంది.