News October 10, 2025

2047నాటికి నంబర్ వన్‌గా AP: చంద్రబాబు

image

AP: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విశ్వసముద్ర గ్రూప్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘రామాయపట్నంలో త్వరలో BPCL పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది. 2047నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పటికి దేశంలోనే AP నంబర్ వన్‌గా అవతరిస్తుంది’ అని తెలిపారు.

Similar News

News October 11, 2025

హనీమూన్ కూడా మీరే ప్లాన్ చేయండి: త్రిష

image

పెళ్లికాని హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. అందుకే ఎప్పుడూ ఆమె పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఆమెకు చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి సెట్ అయ్యిందనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. ‘వేరే వాళ్లు నా జీవితాన్ని ప్లాన్ చేయడం నాకు నచ్చుతుంది. వాళ్లే హనీమూన్ కూడా ప్లాన్ చేస్తారని వెయిట్ చేస్తున్నా’ అని సెటైరికల్ స్టోరీని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

News October 11, 2025

4 గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ: పవన్

image

AP: పంచాయతీలు బలోపేతం అవుతున్నాయని Dy.CM పవన్ అన్నారు. గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను రద్దు చేస్తూ క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు తెలిపారు. 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నామన్నారు. గ్రామ కార్యదర్శి పేరు పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు చేసినట్లు వివరించారు.

News October 11, 2025

అఫ్గాన్ల సపోర్ట్ ఎప్పుడూ భారత్‌కే: పాక్

image

తాము ఎన్ని త్యాగాలు చేసినా అఫ్గాన్లు మాత్రం భారత్ వైపే ఉంటారని పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ విమర్శించారు. ‘చరిత్ర చూస్తే అఫ్గానిస్థాన్ ఎప్పుడూ భారత్‌కు విధేయంగానే ఉంది. నిన్న, ఇవాళ, రేపు కూడా అదే జరుగుతుంది’ అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో గత ప్రభుత్వాలు లక్షలాది మంది అఫ్గాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడాన్ని తప్పుబట్టారు. పాక్ ధాతృత్వం గుడ్ విల్‌గా మారలేదని అసహనం వ్యక్తం చేశారు.