News October 10, 2025
మంచిర్యాలలో ఈ నెల 13న ప్రజావాణి

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణిని ఈ నెల 13 నుంచి యథావిధిగా కొనసాగించనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశ మందిరంలో ప్రజావాణి యథావిధిగా ఉంటుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 11, 2025
అక్టోబర్ 11: చరిత్రలో ఈ రోజు

1902: లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జననం
1922: సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు జననం
1942: సినీ నటుడు అమితాబ్ బచ్చన్ జననం
1947: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేష్ జననం
1972: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ జననం
1993: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య జననం
1997: సినీ, నాటక, రచయిత గబ్బిట వెంకటరావు మరణం
✯ అంతర్జాతీయ బాలికా దినోత్సవం
News October 11, 2025
విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ పరిధిలోని జేఎన్టీయూలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. ఆన్ లైన్ లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ నరసింహ పాల్గొన్నారు.
News October 11, 2025
సిర్పూర్ (టి): పెద్దపులి దాడిలో ఆవు మృతి

ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. శుక్రవారం సిర్పూర్ (టి) మండలం నవేగాం, ఇటిక్యాల గ్రామాల్లో పెద్దపులి సంచరించిందని అటవీ అధికారులు తెలిపారు. నవేగాంలో జుంగరి శివరామ్‌కు చెందిన ఆవుపై దాడి చేసి చంపినట్లు వెల్లడించారు. దీంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.