News October 10, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: కంప్లైంట్ నంబర్లు ఇవే!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికతలో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరైనా.. ఎక్కడైనా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిస్తే ఈ నంబర్లకు కాల్ చేసి చెప్పొచ్చు. కమిటీ ఛైర్‌పర్సన్‌గా మంగతయారు నియమితులయ్యారు. 91776 08271, 91212 40116, 98490 44893 నంబర్లు ఏర్పాటు చేశారు.

Similar News

News October 11, 2025

ముంబైలో రూ.3కోట్ల హవాలా డబ్బును పట్టుకున్న ఈగల్ టీమ్

image

ఈగిల్ టీమ్ మరో ఆపరేషన్‌లో విజయవంతం చేసింది. డ్రగ్, మనీ లాండరింగ్ కింగ్‌పిన్ దర్గారం ప్రజాపతిని అరెస్ట్ చేసింది. ముంబైలో రూ.3 కోట్ల హవాలా డబ్బు స్వాధీనం చేసుకుంది. నైజీరియా డ్రగ్ కార్టెల్ నెట్‌వర్క్‌ను ఈగిల్ టీమ్ ఛేదించింది. ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ అయ్యారు. నకిలీ పాస్‌పోర్ట్‌లతో విదేశీయులు ప్రవేశిస్తున్నట్లు కూడా గుర్తించారు.

News October 11, 2025

నగరంలో కాకరేపిన ‘లోకల్, నాన్- లోకల్’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ నియోజకవర్గంలో ఇప్పుడు లోకల్, నాన్-లోకల్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే నగర ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానికులకే టికెట్ అంటూ చేసిన వాఖ్యలు నగరంలో దుమారం రేపాయి. నవీన్ యాదవ్ <<17966984>>కామెంట్స్<<>> తర్వాత PJR అభిమానులు భగ్గుమన్నారు. త్వరలో జరిగే DCC నియామక ప్రక్రియ, GHMC ఎన్నికలపై దీని ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు నేతల మధ్య చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్.

News October 11, 2025

OU: విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, జూనియర్ డిప్లొమా ఇన్ జర్మన్, సీనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, సీనియర్ డిప్లొమా ఇన్ జర్మన్ కోర్సుల పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.