News October 10, 2025

ఆదిలాబాద్: ITI, ATCలో 5వ విడత అడ్మిషన్లు

image

ప్రభుత్వ ప్రైవేట్ ITI, ATCలలో ప్రవేశాల కోసం 5వ విడత వాక్-ఇన్ అడ్మిషన్స్ చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 17 వరకు ఈ అవకాశం ఉందన్నారు. ప్రవేశాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా, సీట్లు అందుబాటులో ఉన్న మేరకు మాత్రమే కేటాయిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కళాశాలలో హాజరు కావాలని సూచించారు.

Similar News

News October 11, 2025

ప్రధాని నోట.. ఆదిలాబాద్ లడ్డూల గొప్పతనం

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదిలాబాద్ మహువా లడ్డూల గురించి ప్రస్తావించడం ద్వారా రోజువారీ అమ్మకాలు 7 నుంచి 60 కిలోలకు పెరిగాయని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నెలకు 2,000 కిలోల లడ్డూలు అమ్ముడవుతున్నాయని, అవి ‘ఆదివాసీ ఆహారం’ పథకంలో భాగంగా 60 హాస్టళ్లకు చేరుతున్నాయన్నారు. ఈ లడ్డూలు ఆదివాసీ మహిళలకు నిలకడైన ఆదాయం, గౌరవాన్ని అందిస్తున్నాయని తెలిపారు.

News October 11, 2025

రౌడీ షీటర్ల ప్రవర్తనను పరిశీలించాలి: ADB SP

image

రౌడీ షీటర్ల, సస్పెక్ట్ షీటర్ల ప్రవర్తనను ప్రతివారం పరిశీలించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీసులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గన్ లైసెన్సులపై శుక్రవారం సమీక్ష సమావేశంలో మాట్లాడారు. శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగించే వారి వివరాలు తీసుకొని బైండోవర్ చేయాలన్నారు. సన్మార్గంలో ఉన్న, ప్రవర్తన మార్చుకున్న రౌడీలపై రౌడీ షీట్ ఎత్తివేయాలని సూచించారు. నేర పరిశోధనలో మరింత అప్రమత్తతో ఉండాలన్నారు.

News October 11, 2025

ఆదిలాబాద్: సోమవారం యథావిధిగా ప్రజావాణి

image

ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇదివరకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణిని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. ప్రజలు వినతులను స్వీకరించేందుకు ప్రజావాణిని తిరిగి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.