News October 10, 2025

ADB: స.హ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

image

సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఆర్టీఐ చట్టాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్యామలదేవి అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సమాచారం పొందే హక్కు గురించి పౌరులలో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 నుంచి 12 వరకు RTI వారోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Similar News

News October 12, 2025

ఆదిలాబాద్ జిల్లాకు అవార్డుల పంట

image

జాతీయ స్థాయిలో ఆదిలాబాద్ జిల్లా తనదైన గుర్తింపు పొందుతూ అవార్డులను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే నీతీ ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ద్వారా నార్నూర్ మండలం ఎంపిక కాగా.. ఇటీవల జలసంచాయ్.. జన్ భగీధారి అవార్డును అందుకుంది. కలెక్టర్ రాజర్షి షా ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ లెర్నింగ్ ఫౌండేషన్ ప్రోగ్రాం ‘ఇంప్రూవ్ సాఫ్ట్ స్కిల్స్ ఆమాంగ్ స్టూడెంట్స్’ థీమ్ కింద విజేతగా నిలిచింది. దీంతో మరో అవార్డు జిల్లా ఖాతాలో పడింది.

News October 11, 2025

సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ADB SP

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సూచించారు. డబ్బుపై అత్యాశతో, ఉద్యోగంపై ఆసక్తితో లేదా తక్కువ సమయంలో లోను వస్తుందని సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రజలు మోసపోతున్నారని వివరించారు. ఆర్థిక నేరం, సోషల్ మీడియా నేరం, యూపీఐ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్ వంటి మోసాలకు గురైతే వెంటనే 1930కి సంప్రదించాలన్నారు. ఈ వారం జిల్లాలో 11 సైబర్ ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు.

News October 11, 2025

రైతులను ఆర్థిక పరిపుష్టి చేయడమే లక్ష్యం: గోడం నగేశ్

image

రైతులను ఆర్థిక పరిపుష్టి చేయడమే ప్రధాని లక్ష్యం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి పాల్గొన్నారు. అన్నీ రాష్ట్రాల్లో పంట ఉత్పత్తులు, వ్యవసాయం, డెయిరీ, ఫిషరిష్ రంగాలను ప్రోత్సహించడానికి రూ.42 వేల కోట్లతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు.