News October 10, 2025

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచాలి: కలెక్టర్

image

అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణులు, పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై శుక్రవారం సమీక్ష నిర్వహించి వారు మాట్లాడారు. సిబ్బంది పనితీరును మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించాలని, వైద్యాధికారుల సహకారంతో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.

Similar News

News October 11, 2025

KMR: 49 మద్యం దుకాణాలకు 90 అప్లికేషన్లు

image

కామారెడ్డి జిల్లాలోని వైన్ షాపుల దరఖాస్తుల ప్రక్రియ కోనసాగుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 49 మద్యం దుకాణాలకు గాను 90 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. హనుమంతరావు ఓ ప్రకటనలో తెలిపారు. రెండవ శనివారం అయినప్పటికీ, అక్టోబర్ 11న కూడా దరఖాస్తులు యథావిధిగా స్వీకరించబడతాయని ఆయన స్పష్టం చేశారు.

News October 11, 2025

ఇకనైనా మారుతారా? జైలు శిక్షలు తప్పవన్న SP

image

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని జిల్లా SP రాజేష్ చంద్ర హెచ్చరించారు. శుక్రవారం 42 మందికి జైలు శిక్ష, జరిమానాలు విధిస్తూ న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారన్నారు. దేవునిపల్లి, కామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి పరిధిలోని 8 మందికి ఒక్కొక్కరికీ 1 రోజు జైలు శిక్ష, వెయ్యి చొప్పున ఫైన్ విధించారు. మిగిలిన 34 మందికి కలిపి రూ.34 వేల జరిమానా విధించారని SP వెల్లడించారు.

News October 11, 2025

దుబ్బాక ఆసుపత్రిని సందర్శించిన ASCI బృందం

image

దుబ్బాక ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ASCI) బృందం శుక్రవారం సందర్శించింది. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన బృందం జరుగుతున్న వైద్య సేవలపై ఆరా తీసి సంబంధిత రికార్డులను పరిశీలించారు. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు, పరిశుభ్రత సంతృప్తికరంగా ఉన్నాయని బృంద సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.