News April 7, 2024
ఘోరం: 29 గంటలపాటు ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య
కేరళలోని వయనాడ్ వెటర్నరీ విద్యార్థి సిద్ధార్థన్(20) FEB 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ‘FEB 16న ఉ.9 నుంచి మరుసటి రోజు మ.2 వరకు 29 గంటలపాటు సిద్ధార్థన్‌పై సీనియర్లు క్రూరంగా దాడి చేశారు. బెల్టులతో కొడుతూ ర్యాగింగ్ చేశారు. దీంతో మానసిక ఒత్తిడికి గురై అతను బాత్‌రూమ్‌లో ఉరివేసుకున్నాడు’ అని పోలీసులు నివేదించారు. కాగా ఈ కేసును CM విజయన్ CBIకి అప్పగించారు.
Similar News
News January 9, 2025
రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమల వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార ప్రొటోకాల్ దర్శనాలు రేపు తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఈ నెల 19 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలు జరగనున్నాయి.
News January 9, 2025
తొక్కిసలాట ఘటన.. రెండు కేసులు నమోదు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో రెండు కేసులు నమోదయ్యాయి. బైరాగిపెట్టెడ వద్ద తొక్కిసలాట ఘటనపై ఈస్ట్ పీఎస్‌లో నారాయణపురం ఎంఆర్‌వో, విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్‌వో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి టోకెన్లు జారీ చేసే క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు రావడంతో మూడు చోట్ల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు.
News January 9, 2025
ఢిల్లీ కాంగ్రెస్ ఫైర్.. పృథ్వీరాజ్ చవాన్ యూటర్న్!
కాంగ్రెస్ సీనియర్ నేత, MH EX CM పృథ్వీరాజ్ చవాన్‌పై ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ మండిపడింది. ప్రత్యర్థి ఆమ్‌ఆద్మీపై అంత నమ్మకముంటే ఆ పార్టీ టికెట్ పైనే పోటీచేయాల్సిందని విమర్శించింది. ఢిల్లీలో AAP గెలుస్తుందంటూ ఆయన జోస్యం చెప్పడంతో ఫైర్ అయింది. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని, పొత్తు ఉండుంటే INDIA కూటమి గెలిచేదని చెప్పినట్టు <<15104187>>చవాన్<<>> వివరణ ఇచ్చుకున్నారు. ఏదేమైనా కాంగ్రెస్‌దే గెలుపని తాజాగా చెప్పారు.