News October 10, 2025

యాదాద్రి: ఫోన్‌లో మాట్లాడి.. ఉరేసుకున్న యువకుడు.!

image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ నల్ల శంకర్ (22) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 9 రాత్రి తల్లిదండ్రులు వేరే ఇంటికి వెళ్లగా, శంకర్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఈరోజు ఉదయం 6 గంటలకు వంటగది పైకప్పుకు చీరతో ఉరేసుకుని కనిపించాడు. ఓ అమ్మాయితో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని ఫిర్యాదు అందినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 11, 2025

సిద్దిపేట–ఎల్కతుర్తి హైవే పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

సిద్దిపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆర్డీఓ రామ్మూర్తితో కలిసి హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి పనుల కోసం అవసరమైన బస్వాపూర్, పందిళ్ల ప్రాంతాల భూసేకరణ వివరాలను రెవెన్యూ అధికారులు త్వరగా అందజేయాలని స్పష్టం చేశారు.

News October 11, 2025

OU: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఓయూ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సుల ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈ నెల 22వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలన్నారు. ఈ పరీక్షలను ఈ నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

News October 11, 2025

సెహ్వాగ్ సాయం.. U19 జట్టులో పుల్వామా అమరవీరుడి కుమారుడు!

image

పుల్వామా దాడిలో అమరుడైన విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ హరియాణా U19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. గత ఐదేళ్లుగా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తన స్కూలులో రాహుల్‌కు ఉచిత విద్య, క్రికెట్ ట్రైనింగ్ అందిస్తున్నారు. U19 టీమ్‌కు రాహుల్ ఎంపికవడం గర్వంగా ఉందని సెహ్వాగ్ తెలిపారు. రాహుల్ గతంలో హరియాణా U14, U16 జట్లకు ఆడాడు. కాగా మరో అమర జవాన్ రామ్ వకీల్ తనయుడు అర్పిత్ కూడా సెహ్వాగ్ స్కూలులోనే చదువుతున్నాడు.