News October 10, 2025
రేపు దేవళంపేటలో పర్యటించనున్న మంత్రి

వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని హోం మంత్రి అనిత శనివారం పరిశీలించనున్నట్లు జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులుతెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమెతోపాటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.
Similar News
News October 11, 2025
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిశీలించిన చిత్తూరు ఎస్పీ

చిత్తూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎస్పీ తుషార్ డూడీ శుక్రవారం పరిశీలించారు. త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుల్‌లకు శిక్షణ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గదులు పరిశుభ్రంగా గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు.
News October 10, 2025
చిత్తూరు: టీచర్ల శిక్షణను పరిశీలించిన కలెక్టర్

మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లకు చిత్తూరులోని ఓ స్కూల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిని కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. నూతనంగా ఎంపికైన టీచర్లు బాధ్యతాయుతంగా పనిచేసి భావి భారత పౌరులను తయారు చేసేలా కృషి చేయాలని సూచించారు. విధుల్లో చేరిన నాటి నుంచి చివరి దశ వరకు ఉత్సాహంగా పనిచేయాలన్నారు. సమగ్ర శిక్ష ఏపీడీ వెంకటరమణ, ఇందిరా, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
News October 9, 2025
పాలీహౌస్ వ్యవసాయంపై దృష్టి పెట్టండి: కలెక్టర్

పాలీహౌస్ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని ఈ పద్ధతి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కుప్పంలో ఉద్యానవన శాఖ సీడ్ ఏపీ ఆధ్వర్యంలో పాలీహౌస్ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం రైతులతో సమావేశం అయి వారికి పలు సూచనలు ఇచ్చారు.