News October 10, 2025

మద్నూర్: తిట్టాడని కట్టెలతో కొట్టి చంపారు: DSP

image

డబ్బుల విషయంలో జరిగిన హత్య కేసులో 8మందిని అరెస్టు చేసినట్లు బాన్సువాడ DSP విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మద్నూర్ మండలం సోమూరులో SEP 28న డబ్బులు బాకీ విషయంలో రాజ్‌కుమార్ తిట్టడంతో, ఆగ్రహించిన 8మంది అతన్ని తీవ్రంగా కొట్టారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు DSP వెల్లడించారు. CI రవికుమార్, SI విజయ్ కొండ ఉన్నారు.

Similar News

News October 11, 2025

ఈ నెల 24 నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు

image

TG: స్కూళ్లలో ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు మొదటి సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్ షెడ్యూల్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారు. 7, 9 తరగతులకు మధ్యాహ్నం, మిగిలిన తరగతులకు ఉదయం పూట పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 3న ఫలితాల ప్రకటన, 15న పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు.

News October 11, 2025

సిద్దిపేట–ఎల్కతుర్తి హైవే పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

సిద్దిపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆర్డీఓ రామ్మూర్తితో కలిసి హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి పనుల కోసం అవసరమైన బస్వాపూర్, పందిళ్ల ప్రాంతాల భూసేకరణ వివరాలను రెవెన్యూ అధికారులు త్వరగా అందజేయాలని స్పష్టం చేశారు.

News October 11, 2025

OU: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఓయూ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సుల ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈ నెల 22వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలన్నారు. ఈ పరీక్షలను ఈ నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.