News October 10, 2025
జగిత్యాల: ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలి: అడిషనల్ కలెక్టర్

ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జగిత్యాల జిల్లాలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణకు సహకార సంఘాలు సిద్ధంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్లో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణపై శుక్రవారం సహకార సంఘాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం సేకరణకు వేరువేరుగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పౌరసరఫరాల అధికారి, మేనేజర్ తదితరులున్నారు.
Similar News
News October 11, 2025
నేతన్న భరోసా పథకానికి రూ.48.80 కోట్లు: మంత్రి తుమ్మల

TG: నేతన్న భరోసా పథకానికి ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేతలకు రూ.18వేలు, అనుబంధ కార్మికులకు రూ.6వేల చొప్పున రెండు విడతల్లో అందజేస్తామన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 6,780 మందికి రూ.లక్ష వరకు మాఫీ కానున్నట్లు పేర్కొన్నారు. 65 లక్షల ఇందిరమ్మ చీరలను నవంబర్ 15 నాటికి సిద్ధం చేయాలని సూచించారు.
News October 11, 2025
నగరంలో అమలు కానీ ‘సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్’

HYD మోజంజాహి మార్కెట్, కాటేదాన్, నాచారం, బేగంబజార్, అమీర్‌పేట్, మల్లాపూర్, బాలానగర్, ప్రాంతాల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఏమాత్రం తగ్గటం లేదు. కిరాణా దుకాణాలు, రైతు బజార్లలో ఎక్కడపడితే అక్కడ ఈ కవర్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో సుమారు 8,500 టన్నుల గార్బేజీ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, వీటిలో సుమారు 12 టన్నులకు పైగా ఇవే కనిపిస్తున్నాయి.
News October 11, 2025
కరీంనగర్: 277 పెండింగ్ చలాన్ల బైక్ పట్టివేత

కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు ఉన్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారు. గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్‌కు చెందిన బైక్‌కు <<17964893>>277 చలాన్లలో రూ.79,845 జరిమానా <<>>బకాయి ఉన్నట్లు గుర్తించి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.TS 02 EX 1395 అనే బండికి భారీ జరిమానాలు అనే శీర్షికతో Way2Newsలో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఎట్టకేలకు భారీ జరిమానాలు ఉన్న వాహనాన్ని పట్టుకున్నారు.