News October 10, 2025
బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాలి: అదనపు కలెక్టర్

2024-25 రబీ సీజన్ బియ్యాన్ని రా మిల్లర్లు వెంటనే ప్రభుత్వానికి అందించాలని జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. జనగామ కలెక్టరేట్‌లో శుక్రవారం మిల్లర్లతో సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కేటాయింపులు మిల్లర్ల సూచనల ప్రకారం ఉంటాయని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్‌లను తక్షణం సమర్పించాలని కోరారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు రావద్దన్నారు.
Similar News
News October 11, 2025
ఆత్మ జ్ఞానమే అత్యున్నత ధర్మం

ధర్మశాస్త్రాల ప్రకారం.. గొప్ప వాటిని రక్షించడానికి చిన్నవాటిని త్యాగం చేయవచ్చు. ఉదాహరణకు.. దేశం కోసం గ్రామాన్ని, గ్రామం కోసం కుటుంబాన్ని వదులుకోవచ్చు. అయితే వీటన్నింటికంటే అత్యంత ప్రియమైనది, శాశ్వతమైనది ఆత్మ. భార్య, సంపదలు కూడా ఆత్మ ప్రీతి కోసమే మనకు ప్రియంగా మారుతాయి. ఇక్కడ ఆత్మ అంటే ఆ పరమాత్ముడే. ఆయన మనలోనే ఉంటాడు. ఇలా.. ఆత్మ జ్ఞానాన్ని పొందడమే జీవన పరమావధి అని విదురుడు చెబుతాడు. <<-se>>#Daivam<<>>
News October 11, 2025
ఈ నెల 24 నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు

TG: స్కూళ్లలో ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు మొదటి సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్ షెడ్యూల్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారు. 7, 9 తరగతులకు మధ్యాహ్నం, మిగిలిన తరగతులకు ఉదయం పూట పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 3న ఫలితాల ప్రకటన, 15న పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు.
News October 11, 2025
సిద్దిపేట–ఎల్కతుర్తి హైవే పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

సిద్దిపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆర్డీఓ రామ్మూర్తితో కలిసి హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి పనుల కోసం అవసరమైన బస్వాపూర్, పందిళ్ల ప్రాంతాల భూసేకరణ వివరాలను రెవెన్యూ అధికారులు త్వరగా అందజేయాలని స్పష్టం చేశారు.