News October 10, 2025
రోడ్డు ప్రమాదం కారణాలను నమోదు చేయాలి: కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల మూల కారణాలను తెలుసుకొని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ రూపొందించిన ఐ-ఆర్ఏడీ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాల్లో నివారణకు తీసుకున్న చర్యలపై నివేదికలు అందజేయాలన్నారు.
Similar News
News October 11, 2025
చేబ్రోలులో ఉచిత డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, స్కిల్ హబ్‌లో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఈ శిక్షణ కోసం ఆసక్తిగల యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. మరిన్ని వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని కోరారు.
News October 10, 2025
విహారి, ఆంధ్రా లేబరు పత్రికలకు ఆయనే సంపాదకులు

తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి ఆగస్టు 10, 1918న ఉమ్మడి గుంటూరు జిల్లా అమృతలూరు మండలం యలవర్రులో జన్మించారు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్‌లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదురుకొని, తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నారు. ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికలలో వ్యాసాలు రాశారు. విహారి, ఆంధ్రా లేబరు పత్రికలకు సంపాదకత్వం వహించారు.
News October 10, 2025
ఆయన ఇలాంటి పాత్ర ధరించినా దానికి న్యాయం చేశారు

ముదిగొండ లింగమూర్తి (అక్టోబర్ 10, 1908-జనవరి 24,1980) గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన పాతతరం నటుడు. నాటకరంగం మీద అన్ని రకాల పాత్రలూ ధరించి, పేరుతెచ్చుకుని, సినిమా రంగంలో ప్రవేశించారు. వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందేమాతరం సినిమాతో పేరు తెచ్చుకున్నారు. క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా ఉండేది.