News October 10, 2025
పిల్లలు క్రాకర్స్ కాల్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి.. సుప్రీంకు వినతి

ఢిల్లీలో బాణసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. దేశ రాజధానిలో ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం దృష్ట్యా బాణసంచా విక్రయం, వినియోగంపై ఈ ఏడాది APRలో SC నిషేధం విధించింది. ఇవాళ దీనిపై విచారణ జరగగా పండుగ కోసం పిల్లలు ఎదురుచూస్తున్నారని, పర్యావరణహితమైన క్రాకర్స్‌కు అనుమతించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీపావళి రోజు రా.8-10 గంటల మధ్య పర్మిషన్ ఇవ్వాలన్నారు.
Similar News
News October 11, 2025
నేతన్న భరోసా పథకానికి రూ.48.80 కోట్లు: మంత్రి తుమ్మల

TG: నేతన్న భరోసా పథకానికి ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేతలకు రూ.18వేలు, అనుబంధ కార్మికులకు రూ.6వేల చొప్పున రెండు విడతల్లో అందజేస్తామన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 6,780 మందికి రూ.లక్ష వరకు మాఫీ కానున్నట్లు పేర్కొన్నారు. 65 లక్షల ఇందిరమ్మ చీరలను నవంబర్ 15 నాటికి సిద్ధం చేయాలని సూచించారు.
News October 11, 2025
10,000+ జనాభా ఉంటే రూర్బన్ పంచాయతీలు: Dy.CM

AP: 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తించనున్నట్లు <<17972541>>Dy.CM పవన్<<>> తెలిపారు. రూర్బన్ పంచాయతీలలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. గ్రేడ్-1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శులకు వేతన శ్రేణి పెంపుతో పాటు డిప్యూటీ MPDO కేడర్‌కు వారిని ప్రమోట్ చేస్తామన్నారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమించనున్నట్లు పేర్కొన్నారు.
News October 11, 2025
మూడో తరగతి నుంచే AI పాఠాలు!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో మూడో తరగతి నుంచే AIపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఫ్యూచర్ వర్క్ ఫోర్స్‌ను AI-రెడీగా మార్చాలని భావిస్తోంది. టీచర్లు AI టూల్స్ వాడి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు జరుగుతున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. కాగా కొన్ని CBSE స్కూళ్లలో ఇప్పటికే AIపై పాఠాలు బోధిస్తున్నారు.