News October 10, 2025
ఈ నెల 16న కర్నూలులో మోదీ సభ

AP: కర్నూలులో ఈ నెల 16న సూపర్ GST-సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. దీనికి PM మోదీతో పాటు CM, Dy.CM, మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు. ఆ రోజు ఉదయం మోదీ సున్నిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. తర్వాత సభా ప్రాంగణానికి వెళ్లి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.
Similar News
News October 11, 2025
శివుడి అష్ట మూర్తులు

1. శివుడు/శర్వుడు – పృథ్వీ మూర్తి
2. భవుడు – జల మూర్తి
3. పశుపతి – అగ్ని మూర్తి
4. ఈశానుడు – వాయు మూర్తి
5. భీముడు – ఆకాశ మూర్తి
6. రుద్రుడు – సూర్య మూర్తి
7. మహాదేవుడు – సోమ మూర్తి
8. ఉగ్రుడు – యజమాన మూర్తి
<<-se>>#Sankhya<<>>
News October 11, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షం

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ వీటితో పాటు నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని పేర్కొంది. .
News October 11, 2025
హైదరాబాద్ ECILలో 90 పోస్టులు

HYDలోని ECIL 90 పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ఆర్టిజన్ పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 15, 16, 17, 18 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు ప్రాజెక్టు ఇంజినీర్‌కు 33ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 30ఏళ్లు. వెబ్‌సైట్:
https://www.ecil.co.in