News October 10, 2025
గచ్చిబౌలిలో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు

గ్రేస్ క్యాన్సర్ రన్ నేపథ్యంలో ఆదివారం గచ్చిబౌలి పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉ.5:30 నుంచి 8:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ప్రకటనలో తెలిపారు. 10 కిలోమీటర్ల ఈ పరుగు గచ్చిబౌలి మెయిన్ స్టేడియం నుంచి IIIT జంక్షన్, విప్రో జంక్షన్ మీదుగా సాగుతుందన్నారు. విప్రో జంక్షన్ నుంచి IIIT వైపు వెళ్లే వాహనాలను వేరే దారిలో మళ్లించనున్నట్లు తెలిపారు.
Similar News
News October 11, 2025
HYD: సంచలన ప్రకటన.. ‘మార్వాడీలు కొత్త షాపులు పెట్టొద్దు’

కష్టపడి సాధించుకున్న తెలంగాణను మార్వాడీలు కల్తీగా తయారు చేస్తున్నారని, ఏ మార్వాడీ షాపులో చూసినా తక్కువ ధర అని చెప్పి కల్తీ సామగ్రి అమ్ముతున్నారని ‘గో బ్యాక్ మార్వాడీ’ JAC నాయకులు ఆరోపించారు. శుక్రవారం HYDలో JAC రాష్ట్ర కార్యదర్శిగా పూదరి ధనుంజన్‌ను స్టేట్ చీఫ్ పిడమర్తి రవి నియమించి మాట్లాడారు. ఇకపై TGలో మార్వాడీలు కొత్త షాపులు పెట్టొద్దన్నారు. బంగారం షాపుల్లో అధిక వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు.
News October 11, 2025
ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్యాయత్నం

ములకలచెరువు(M)నికి చెందిన ఓ యువకుడు ప్రియురాలు మోసం చేసిందని విషం తాగి తాగాడు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని బురకాయలకోటకు చెందిన గణేష్ స్థానికంగా ఉండే టోల్ గేట్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉండటమే కాకుండా పెళ్లికి నిరాకరించిందని ఆయన మనస్తాపం చెందాడు. ఆ బాధతో విషం తాగగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు.
News October 11, 2025
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ చీరలపై.. భారీగా ఆదాయం!

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ చీరల టెండర్ ప్రక్రియలో ఆలయానికి ఆదాయం పెరిగింది. గత ప్రభుత్వంలో ప్రైవేటు సంస్థకు రెండేళ్లకు రూ. 5.50 కోట్లకు టెండర్ ఇవ్వగా, బహిరంగ వేలంలో రూ. 8.15 కోట్లకు చేరింది. దీంతో ఏడాదికి రూ. 2.5 కోట్లకు పైగా ఆదాయం పెరిగింది. అక్టోబర్ 1న సీల్డ్ కవర్, బహిరంగ వేలం టెండర్లను పిలిచారు. శుక్రవారం జరిగిన టెండర్లో గుంటూరుకు చెందిన శ్రీపావని కలెక్షన్స్ రూ.8.15 కోట్లకు టెండర్ దక్కింది.