News October 11, 2025
బేగంపేట్ సీఎం ప్రజావాణికి 275 దరఖాస్తులు

బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 275 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 76, రెవెన్యూ శాఖకు సంబంధించి 43, ఇందిరమ్మ ఇళ్ల కోసం 85, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 69 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 12, 2025
HYD: మటన్ గ్రాముకు @ రూపాయి..!

నగరంతో సహా శివారులో మటన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఒకప్పుడు ఆదివారపు విందుగా ఉన్న మటన్ ఇప్పుడు విలాస వంటకంగా మారింది. నెల రోజులుగా కిలో మటన్ ధర రూ.1000గా కొనసాగుతోంది. మేకలు, గొర్రెల కొరత, రవాణా వ్యయాలు అధికమవ్వడంతో ధరలు పెరుగుతున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. ఇంత ఖరీదైనప్పటికీ గసగసాలు వేసి గుమగుమలాడే యాట కర్రీ వండటానికి ప్రజలు వెనుకాడటం లేదు. దుకాణాల వద్ద భారీగా క్యూ ఉంటోంది. మీ ప్రాంతంలో ధర ఎంతుంది?
News October 12, 2025
HYD: రెండు రోజులు నీటి సరఫరా బంద్

కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్-3 పంపింగ్‌కు సంబంధించి భారీ లీకేజీకి మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని జలమండలి అధికారులు తెలిపారు. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, రాంపల్లి, బోడుప్పల్, సరూర్‌నగర్, బండ్లగూడ, ఉప్పల్, శంషాబాద్, నాగోల్ ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
News October 12, 2025
HYD: ఓటర్ స్లిప్ ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు: కర్ణన్

ఈనెల 22 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభించి నవంబర్ 5 వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు HYD ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఓటరు స్లిప్పుల పంపిణీ చాలా ముఖ్యమని, ఓటరు స్లిప్ ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు.