News October 11, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

✯సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే శంకర్
✯డయాలసిస్ సేవలు సకాలంలో అందించాలి: జడ్పీ చైర్‌పర్సన్
✯ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్యే కూన ఆగ్రహం
✯కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే అశోక్
✯ లక్ష్మీపురంలో కుక్కల స్వైరవిహారం
✯జిల్లాలో పలుచోట్ల సూపర్ జీఎస్టీపై అవగాహన
✯పొందూరు: భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి

Similar News

News October 11, 2025

ఉత్తరాంధ్రలో చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: చంద్రబాబు

image

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రలో చేపడతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమవుతున్నామని CM చంద్రబాబు వ్యాఖ్యనించారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు స్టీల్‌ప్లాంట్‌ మూతపడకుండా కాపాడామన్నారు. ముఖ్యంగా IT కంపెనీల స్థాపన, గూగుల్‌ డేటా సెంటర్‌, మిట్టల్‌ స్టీల్‌‌ వంటి కీలక ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులను ఆదేశించారు.

News October 11, 2025

టెక్కలి: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలోని తోటలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తోటలో వేలాడుతున్న వ్యక్తి టెక్కలిలోని ఎన్టీఆర్ కాలనీ 9వ లైన్‌లో నివాసముంటున్న గణపతి(50)గా గుర్తించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News October 11, 2025

SKLM: ‘సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

image

సామాజిక న్యాయానికి కూటమి ప్రభుత్వం పట్టుబడి ఉందని ఆముదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూన, రవికుమార్ గొండు శంకర్ అన్నారు. జిల్లాకలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించి ప్రివెన్షన్ ఆక్ట్‌పై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎస్సీ,ఎస్టీలకు ఎటువంటి అన్యాయం జరిగినా తక్షణం చర్యలు తీసుకోవాలని వారు అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన ఘటనపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.