News October 11, 2025
OU: విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, జూనియర్ డిప్లొమా ఇన్ జర్మన్, సీనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, సీనియర్ డిప్లొమా ఇన్ జర్మన్ కోర్సుల పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.
Similar News
News October 11, 2025
HYD: రాచకొండ పరిధిలోనే అత్యధిక నేరాలు..!

2023 ఏడాదికి సంబంధించి NCRB రిపోర్టు విడుదల చేసింది. TGలో నమోదైన నేరాలు 1,56,737 కాగా అత్యధికంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 23,289, ‘సైబరాబాద్’లో 22,398 ‘హైదరాబాద్’లో 21,774 నేరాలు నమోదయ్యాయని పేర్కొంది. తాజాగా విడుదల చేసిన రిపోర్టులో అనేక విషయాలను పొందుపరిచి, కొన్ని కేసులకు సంబంధించిన కారణాలను సైతం వివరించింది.
News October 11, 2025
HYD: ఛార్జింగ్ స్టేషన్ పనిచేయడం లేదా..? ఇలా చేయండి..!

గ్రేటర్ HYDలో సుమారు 650 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే కొన్నిటిలో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో పనిచేయటం లేదు. ఈ నేపథ్యంలో రెడ్కో యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. REDCO APP డౌన్‌లోడ్ చేసుకుని ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు, ఫిర్యాదు చేయొచ్చు.
News October 11, 2025
HYD: MNJ ఆధ్వర్యంలో ‘డే కేర్’ సెంటర్లు..!

HYD రెడ్ హిల్స్ వద్ద ఉన్న MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో డే కేర్ సేవలను ఇక జిల్లాల్లో అందించడానికి సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల కొనసాగుతున్నట్లు ప్రొఫెసర్లు తెలిపారు. MNJ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు వర్చువల్ పద్ధతిలో పరీక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పర్యవేక్షించి, అందరికీ వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు.