News October 11, 2025

4 గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ: పవన్

image

AP: పంచాయతీలు బలోపేతం అవుతున్నాయని Dy.CM పవన్ అన్నారు. గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను రద్దు చేస్తూ క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు తెలిపారు. 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నామన్నారు. గ్రామ కార్యదర్శి పేరు పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు చేసినట్లు వివరించారు.

Similar News

News October 11, 2025

పవన్ హాన్స్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే(0CT 12)ఆఖరు తేదీ. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ తదితర ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి B.Tech/B.E, M.A, MCA, డిగ్రీ పూర్తయిన వారు, CHPL/ATPL లైసెన్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్: https://www.pawanhans.co.in/

News October 11, 2025

Ceasefire: సైన్యం వెనక్కి.. ప్రజలు గాజాలోకి!

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పీస్ డీల్ నేపథ్యంలో గాజాలో కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. తమ దళాలను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. దీంతో రెండేళ్లుగా గుడారాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. కానీ గాజాలో అంతా నాశనమైందని వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఆయుధాలు వదలబోమని హమాస్ నేతలు చెబుతుండటంతో యుద్ధం ముగుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News October 11, 2025

రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు: హైకోర్టు

image

TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం <<17958620>>స్టే<<>> విధించగా ఆ ఉత్తర్వుల పూర్తి వివరాలు అర్ధరాత్రి అందుబాటులో వచ్చాయి. గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది. దీంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.