News October 11, 2025
హనీమూన్ కూడా మీరే ప్లాన్ చేయండి: త్రిష

పెళ్లికాని హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. అందుకే ఎప్పుడూ ఆమె పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఆమెకు చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి సెట్ అయ్యిందనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. ‘వేరే వాళ్లు నా జీవితాన్ని ప్లాన్ చేయడం నాకు నచ్చుతుంది. వాళ్లే హనీమూన్ కూడా ప్లాన్ చేస్తారని వెయిట్ చేస్తున్నా’ అని సెటైరికల్ స్టోరీని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
Similar News
News October 11, 2025
ఈ నెల 14న తెలంగాణ బంద్: R.కృష్ణయ్య

TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఈ బంద్‌కు సీఎం రేవంత్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టే ఇవ్వడం దుర్మార్గమని, మిలియన్ మార్చ్ తరహాలో బీసీ ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్తామని నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
News October 11, 2025
శివుడి అష్ట మూర్తులు

1. శివుడు/శర్వుడు – పృథ్వీ మూర్తి
2. భవుడు – జల మూర్తి
3. పశుపతి – అగ్ని మూర్తి
4. ఈశానుడు – వాయు మూర్తి
5. భీముడు – ఆకాశ మూర్తి
6. రుద్రుడు – సూర్య మూర్తి
7. మహాదేవుడు – సోమ మూర్తి
8. ఉగ్రుడు – యజమాన మూర్తి
<<-se>>#Sankhya<<>>
News October 11, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షం

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ వీటితో పాటు నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని పేర్కొంది. .