News October 11, 2025

ఏలూరులో ఈనెల 13 ‘జీఎస్టీ హేలాపురి ఉత్సవం’

image

ఏలూరు జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి శుక్రవారం గూగుల్ మీట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 13 నుంచి 19 వరకు వారం రోజుల పాటు జరిగే ‘జీఎస్టీ హేలాపురి ఉత్సవం’ను పండుగ వాతావరణంలో విజయవంతం చేయడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సీఆర్ రెడ్డి కళాశాలలో జరగబోయే కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

Similar News

News October 11, 2025

ఉత్తరాంధ్రలో అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: చంద్రబాబు

image

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రలో చేపడతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమవుతున్నామని CM చంద్రబాబు వ్యాఖ్యనించారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు స్టీల్‌ప్లాంట్‌ మూతపడకుండా కాపాడామన్నారు. ముఖ్యంగా IT కంపెనీల స్థాపన, గూగుల్‌ డేటా సెంటర్‌, మిట్టల్‌ స్టీల్‌‌ వంటి కీలక ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులను ఆదేశించారు.

KU డిగ్రీ పరీక్ష ఫీజు తేదీలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీల నోటిఫికేషన్ శుక్రవారం KU అధికారులు విడుదల చేశారు. ఈ నెల 23 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 25 వరకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. నవంబర్‌లో పరీక్షలు ఉంటాయని అధికారులు వివరించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.