News April 7, 2024

HYD: అనుమానంతో భార్యను చంపిన భర్త..!

image

భార్యను భర్త హతమార్చిన ఘటన HYD ఉప్పల్ PS పరిధి రామంతాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్‌‌లో శివలక్ష్మి, శివమోహన్ శర్మ దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఈ విషయాన్ని కొడుకు సాయి గణేశ్‌కు తెలిపిన శివమోహన్ అనంతరం పరారయ్యాడు. విగత జీవిగా ఉన్న తల్లిని చూసి కుమారుడు విలపించాడు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 10, 2025

HYD: హైకోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

image

HYD హైకోర్టు ఎదుట బుధవారం అడ్వకేట్లు పాంప్లెట్లతో నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ సురేశ్ బాబుపై జరిగిన దాడికి నిరసనగా గేట్ నంబర్ 6 వద్ద నిరసన ప్రోగ్రాం నిర్వహించారు. వెంటనే సత్వర న్యాయం జరగాలని అందరూ కలిసి డిమాండ్ చేశారు.

News September 10, 2025

HYD: ప్రైవేట్ భూముల రోడ్ల జోలికి హైడ్రా వెళ్ల‌దు: రంగనాథ్

image

ప్రైవేట్ భూముల వివాదాల జోలికి వెళ్లమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. ‘చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగితే ఊరుకోం’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. దళారీల మాయ మాటలు నమ్మవద్దని, వారి చేతిలో మోసపోవద్దని బుధవారం హైడ్రా విజ్ఞప్తి చేసింది.

News September 10, 2025

HYD: కూల్చివేతలపై ఎంపీ ఈటల ఆగ్రహం

image

మల్కాజ్‌గిరి MP ఈటల రాజేందర్ ఈరోజు సికింద్రాబాద్ జేబీఎస్ ఎరుకల బస్తీని సందర్శించారు. షాపుల కూల్చివేతపై వ్యాపారులతో మాట్లాడిన ఆయన, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల జీవనోపాధికి భంగం కలగకుండా అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయిస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.