News October 11, 2025
NLG: వీలైనంత త్వరగా ధాన్యం ఎగుమతి చేయాలి: కలెక్టర్

నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతుల ధాన్యాన్ని వీలైనంత త్వరగా ఎగుమతి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో వెంకటేష్, డీసీవో పత్యా నాయక్, ఎంఏవో శ్రీనివాస్, సీఈవో అనంతరెడ్డి, మానిటరింగ్ అధికారి రాము తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 11, 2025
NLG: ఎవరైనా టెండర్ వేయొచ్చు.. భయపడొద్దు

కొత్త పాలసీ ప్రకారం మద్యం దుకాణాలకు అర్హులంతా నిర్భయంగా దరఖాస్తు చేయాలని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. జిల్లాలో 154 దుకాణాలకు ST వర్గానికి 4, SC వర్గానికి 14, గౌడ సామాజిక వర్గానికి 34 దుకాణాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్ల దుకాణాలకు తమ సంఘాలతో కలిసి మాత్రమే టెండర్ వేయాలని ఇతరులతో కలిసి వేయరాదంటూ కొందరు ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
News October 11, 2025
చెరువుగట్టు హుండీ ఆదాయం @40.46 లక్షలు

ప్రసిద్ధ శైవక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్న నగదు మొత్తం రూ. 40,46,640లు లభించాయి. గట్టుపైన స్వామివారి ప్రధానాలయ హుండీ, ఉపాలయాల హుండీలను తెరిచి లెక్కించగా రూ.34,07,100, గుట్ట కింద పార్వతీ అమ్మవారి ఆలయం వద్ద హుండీలను తెరిచి లెక్కించగా రూ.6,39,540ల ఆదాయం లభించిందని ఈవో నవీన్ కుమార్ తెలిపారు.
News October 11, 2025
NLG: మద్యం దుకాణాలకు 96 దరఖాస్తులు

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు శుక్రవారం మరో 22 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 96 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.