News October 11, 2025

కాకినాడ: స్కిల్ డెవలప్మెంట్ అధికారుల తీరుపై ఎంపీ ఆగ్రహం

image

నిరుద్యోగుల ఉపాధి అవకాశాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన దిశ సమావేశంలో ఆయన దీనిపై మాట్లాడారు. జిల్లాలో ఏడు స్కిల్ హబ్ సెంటర్ల ద్వారా ఈ ఏడాది 631 మంది శిక్షణ పొందారని, 201 మందికే ఉపాధి అవకాశాలు కల్పించారని అసహనం వ్యక్తం చేశారు.

Similar News

News October 11, 2025

KU డిగ్రీ పరీక్ష ఫీజు తేదీలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీల నోటిఫికేషన్ శుక్రవారం KU అధికారులు విడుదల చేశారు. ఈ నెల 23 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 25 వరకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. నవంబర్‌లో పరీక్షలు ఉంటాయని అధికారులు వివరించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News October 11, 2025

పవన్ హాన్స్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే(0CT 12)ఆఖరు తేదీ. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ తదితర ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి B.Tech/B.E, M.A, MCA, డిగ్రీ పూర్తయిన వారు, CHPL/ATPL లైసెన్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్: https://www.pawanhans.co.in/

News October 11, 2025

రాయదుర్గం పేరు చరిత్ర తెలుసా?

image

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పేరు చారిత్రక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. ‘రాయల దుర్గం’ అంటే రాజుల కోట అనే అర్థంతో ఈ పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించిన రాయదుర్గ కోట చుట్టూ పట్టణం అభివృద్ధి చెందింది. కాలక్రమంలో రాయలదుర్గం రాయదుర్గంగా మారిందట. జీవితమంతా రచనా వ్యాసంగంలో తరించిన సాహితీమూర్తి దివంగత జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఇక్కడే జన్మించారు.