News October 11, 2025
త్వరలో నెల్లూరులో అధునాతన కూరగాయల మార్కెట్

నెల్లూరులో అధునాతన వసతులతో అతిపెద్ద కూరగాయల మార్కెట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ నుంచి జీవో విడుదలైంది. నవాబుపేట సమీపంలోని నరుకూరు రోడ్డులో ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డులో నెల్లూరు నగరపాలక సంస్థ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ మార్కెట్‌ను పీపీపీ విధానంలో నిర్మించనున్నారు. మొత్తం 19.69 ఎకరాలలో మార్కెట్ ఏర్పాటు కానుంది.
Similar News
News October 11, 2025
గ్యాంగ్ రేప్ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు

ఉమ్మడి నెల్లూరు(G) సూళ్లూరుపేటలో 2019లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నెల్లూరు 8వ అదనపు కోర్టు న్యాయమూర్తి MA సోమశేఖర్ ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు. ముద్దాయిలు ఇద్దరు సూళ్లూరుపేట బొగ్గుల కాలనీకి చెందిన తిరువల్లూరు నవీన్ కుమార్, సాయి నగర్‌కు చెందిన కేకుల దేవకు జీవిత ఖైదీ విధించారు. దీంతోపాటు నగదు దోపిడీకి పాల్పడినందుకు పదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు.
News October 11, 2025
కావలి రైతుబజారులో ఆధునికరణ

కావలి రైతు బజార్‌ను ఆధునికరించే దిశగా అడుగులు పడుతున్నాయి. మార్కెట్లో ఇప్పటికే శిథిలావస్థకు గురైన దుకాణాలలో తొలగించారు. వర్షం నుంచి రక్షణగా రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రూ.45 లక్షలతో పనులు వారం కిందటే ప్రారంభమయ్యాయి. కొత్తగా దుకాణాల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, పెయింటింగ్ పనులు తదితర వాటికి మరో రూ.50 లక్షలు ఖర్చు కానున్నట్లు సమాచారం.
News October 10, 2025
త్వరలోనే నెల్లూరు జిల్లాకు మహర్ధశ: CM

కృష్ణపట్నంతో పాటు త్వరలోనే రామాయపట్నం, దుగ్గరాజపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా దగదర్తి ఎయిర్ పోర్ట్ పూర్తయితే జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వస్తాయని, దీని వలన పేదరికం తగ్గే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే HYD-చెన్నై, చెన్నై-అమరావతికి బుల్లెట్ ట్రైన్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2047 కల్లా AP ఆర్థికంగా అగ్రస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.