News October 11, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 11, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.19 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News October 11, 2025
గాంధీపై నటుడి అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు

ఇటీవల మహాత్మా గాంధీపై <<17936155>>అసభ్యకర వ్యాఖ్యలు<<>> చేసిన టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్‌పై యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీని వ్యక్తిగతంగా దూషించారని, నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. దేశం గర్వించే గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 11, 2025
11 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్టు పోస్టులు

జమ్మూ ఎయిమ్స్ 11 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ (సోషల్ సైన్సెస్, సోషల్ వర్క్, సోషియాలజీ, పబ్లిక్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్, కమ్యూనిటీ హెల్త్), లేదా సంబంధిత పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ కాంట్రాక్ట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsjammu.edu.in/
News October 11, 2025
భగవంతుని ప్రేమకు భక్తే ఆధారం

భగవంతుడిని పూజించాలంటే ఖరీదైన సమర్పణలు చేయాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు.. నిర్మలమైన బుద్ధి, నిష్కపటమైన భక్తితో అర్పించే ఒక పత్రం, పుష్పం, ఫలం, జలం చాలు. ఆయనే వాటిని ప్రేమతో స్వీకరిస్తాడు. సమస్త జీవుల పట్ల ప్రీతి కలిగి, అద్భుతమైన ఉత్సాహంతో ఆ దేవుడిని దర్శించడానికి ఆరాటపడేవారికి దైవానుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
<<-se>>#Bakthi<<>>