News October 11, 2025

పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

రెవెన్యూకు సంబంధించిన పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి, సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులను జాగ్రత్తగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 11, 2025

1289 పోస్టులు.. అప్లైకి ఇంకా నాలుగు రోజులే

image

స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ విభాగంలో 1,289 హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా నాలుగు రోజులే సమయం( OCT15) ఉంది. ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, PE, MT/ట్రేడ్ టెస్ట్ ద్వారా చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.

News October 11, 2025

UGCలో 17 పోస్టులు.. అప్లై చేసుకోండి

image

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC)లో 17 డొమైన్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఫస్ట్ క్లాస్‌లో PG, PhD, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 45ఏళ్లు. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసే ఈ పోస్టులకు నెలకు రూ.60వేల నుంచి రూ.70వేలు చెల్లిస్తారు. రూ. వెబ్‌సైట్: https://www.ugc.gov.in/

News October 11, 2025

కరీంనగర్: డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ

image

పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టత కోసం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి 18వ తేదీ వరకు ఆశావాహుల నుంచి ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పార్టీకి చేసిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతల వివరాలతో కూడిన బయోడేటాను దరఖాస్తుదారులు స్థానిక జిల్లా అధ్యక్షులకు అందజేయాలని సూచించారు. నవంబర్ మొదటి వారంలో అధిష్టానం అధ్యక్షులను ప్రకటిస్తుంది.