News October 11, 2025

ముంబైలో రూ.3కోట్ల హవాలా డబ్బును పట్టుకున్న ఈగల్ టీమ్

image

ఈగిల్ టీమ్ మరో ఆపరేషన్‌లో విజయవంతం చేసింది. డ్రగ్, మనీ లాండరింగ్ కింగ్‌పిన్ దర్గారం ప్రజాపతిని అరెస్ట్ చేసింది. ముంబైలో రూ.3 కోట్ల హవాలా డబ్బు స్వాధీనం చేసుకుంది. నైజీరియా డ్రగ్ కార్టెల్ నెట్‌వర్క్‌ను ఈగిల్ టీమ్ ఛేదించింది. ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ అయ్యారు. నకిలీ పాస్‌పోర్ట్‌లతో విదేశీయులు ప్రవేశిస్తున్నట్లు కూడా గుర్తించారు.

Similar News

News October 11, 2025

HYD: లిక్కర్ పంపిణీ కట్టడికి చర్యలు తీసుకోవాలి: కర్ణన్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లిక్కర్ పంపిణీ కట్టడికి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రలోభాల కట్టడికి కలిసికట్టుగా పనిచేయాలని, అన్ని శాఖల పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.

News October 11, 2025

HYD: BRS VS కాంగ్రెస్ @ సోషల్ మీడియా

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, BRS నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేందుకు, యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియాను ప్రచార అస్త్రంగా వాడుతున్నారు. ఓ వైపు BRS అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా వారి కూతుళ్లు అక్షర, దిశిర, BRS నేతలు, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్‌తో ప్రచారం చేస్తున్నారు.

News October 11, 2025

HYD: రాచకొండ పరిధిలోనే అత్యధిక నేరాలు..!

image

2023 ఏడాదికి సంబంధించి NCRB రిపోర్టు విడుదల చేసింది. TGలో నమోదైన నేరాలు 1,56,737 కాగా అత్యధికంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 23,289, ‘సైబరాబాద్’లో 22,398 ‘హైదరాబాద్’లో 21,774 నేరాలు నమోదయ్యాయని పేర్కొంది. తాజాగా విడుదల చేసిన రిపోర్టులో అనేక విషయాలను పొందుపరిచి, కొన్ని కేసులకు సంబంధించిన కారణాలను సైతం వివరించింది.