News October 11, 2025
నగరంలో అమలు కానీ ‘సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్’

HYD మోజంజాహి మార్కెట్, కాటేదాన్, నాచారం, బేగంబజార్, అమీర్‌పేట్, మల్లాపూర్, బాలానగర్, ప్రాంతాల్లో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఏమాత్రం తగ్గటం లేదు. కిరాణా దుకాణాలు, రైతు బజార్లలో ఎక్కడపడితే అక్కడ ఈ కవర్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో సుమారు 8,500 టన్నుల గార్బేజీ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, వీటిలో సుమారు 12 టన్నులకు పైగా ఇవే కనిపిస్తున్నాయి.
Similar News
News October 11, 2025
VZM: నేపాల్‌లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లా ప్లేయర్స్

ఇండో-నేపాల్ యూత్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్-2025 (YSEFI)లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. నేపాల్ దేశంలోని పోఖ్రాన్‌లో ఈనెల 7 నుంచి 10వరకు జరిగిన ఈవెంట్‌లో ఇండియా తరుఫున రన్నింగ్(సీనియర్ విభాగం)లో స్వర్ణపతకాలు సాధించారు. పార్వతీపురం మండలం డి.మూలగకు చెందిన యాళ్ల ఈశ్వరరావు(800మీ), గజపతినగరం మండలం భూదేవిపేటకు చెందిన ఇప్పర్తి సూర్యతేజ (400మీ) ఈ ఘనత సాధించారు.
News October 11, 2025
భారత్ 518/5 డిక్లేర్

WIతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 134.2 ఓవర్లలో టీమ్ ఇండియా 518/5 రన్స్ చేసింది. ఓపెనర్ జైస్వాల్ (175), గిల్ (129*) సెంచరీలతో రాణించారు. కేఎల్ రాహుల్ 38, సాయి సుదర్శన్ 87, నితీశ్ కుమార్ రెడ్డి 43, జురెల్ 44 రన్స్ చేశారు.
News October 11, 2025
WBలో మరో MBBS విద్యార్థినిపై అత్యాచారం

బెంగాల్‌లో మరో మెడికల్ స్టూడెంట్ రేప్‌కు గురైంది. ఒడిశాకు చెందిన ఆమె శోభాపూర్ కాలేజీలో చదువుతోంది. మిత్రుడితో కలిసి నిన్న 8.30PMకు తినేందుకు బయటకు వెళ్తుండగా క్యాంపస్ గేటు వద్ద ఓ వ్యక్తి పక్కకు లాక్కెళ్లి రేప్ చేశాడు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. డాక్టర్‌గా చూడాలని ఎన్నో ఆశలతో కుమార్తెను చదివిస్తున్నామని ఆమె తండ్రి రోదించారు. కోల్‌కతా ఆర్జీకర్ రేప్ ఘటనపై దేశవ్యాప్త నిరసనలు రేగడం తెలిసిందే.