News April 7, 2024
జగన్ సీఎం కాదు.. సారా వ్యాపారి: పవన్

AP: సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. ‘అమ్మ ఒడి పథకం ఎంతమంది పిల్లలున్నా వేస్తామని చెప్పి.. 83 లక్షల మంది లబ్ధిదారుల్లో 44 లక్షల మందికే ఇచ్చారు. రూ.19,600కోట్లు అమ్మఒడికి ఇచ్చి.. మద్యం అమ్మి నాన్న తడి పథకం కింద రూ.లక్ష కోట్లు దోచేసిన సారా వ్యాపారి జగన్. మనకి ఈ కోడిగుడ్డు ప్రభుత్వం, కోడిగుడ్డు మంత్రి వద్దు’ అని అనకాపల్లి సభలో జనసేనాని వ్యాఖ్యానించారు.
Similar News
News January 13, 2026
ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ‘ఇరాన్ దేశభక్తులారా.. ప్రభుత్వ సంస్థలను చేజిక్కించుకోండి. మిమ్మల్ని చంపే వారి, నిందించే వారి పేర్లను సేవ్ చేసుకోండి. వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిరసనకారులను చంపడం ఆపేంత వరకు ఇరాన్ ప్రతినిధులతో నా మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నా. మీకు అతిత్వరలో సాయం అందబోతోంది. Make Iran Great Again (MIGA)!’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.
News January 13, 2026
నిరసనలు ప్రపంచానికి తెలియకుండా.. ఇంటింటికీ వెళ్లి..!

నిరసనలను ఉక్కుపాదంతో అణచేస్తున్న ఇరాన్ ఆ వివరాలు ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే ఇంటర్నెట్ నిలిపేయగా, మస్క్‌కు చెందిన <<18836391>>స్టార్‌లింక్ సేవలనూ<<>> 80% కట్ చేసింది. ఇంకా వాడుతున్న వారిని వెంటాడుతోంది. ఇళ్లలో సోదాలు చేసి స్టార్‌లింక్ పరికరాలు స్వాధీనం చేసుకుంటోంది. అధికారులు, ఖమేనీ సపోర్టర్లు ‘వైట్‌లిస్ట్(అనుమతి ఉన్న వారికే యాక్సెస్ ఉండే)’ నెట్‌వర్క్‌లో కమ్యూనికేట్ అవుతున్నారు.
News January 13, 2026
యూపీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా!

సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ రేపు విడుదల కావాల్సింది. కానీ అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. కాగా ప్రిలిమ్స్ పరీక్ష మే 24న, మెయిన్స్ ఆగస్టు 21న నిర్వహిస్తామని గతంలో యూపీఎస్సీ ప్రకటించింది.


