News October 11, 2025
సిద్దిపేట–ఎల్కతుర్తి హైవే పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

సిద్దిపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆర్డీఓ రామ్మూర్తితో కలిసి హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి పనుల కోసం అవసరమైన బస్వాపూర్, పందిళ్ల ప్రాంతాల భూసేకరణ వివరాలను రెవెన్యూ అధికారులు త్వరగా అందజేయాలని స్పష్టం చేశారు.
Similar News
News October 11, 2025
ప్రధాని నోట.. ఆదిలాబాద్ లడ్డూల గొప్పతనం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదిలాబాద్ మహువా లడ్డూల గురించి ప్రస్తావించడం ద్వారా రోజువారీ అమ్మకాలు 7 నుంచి 60 కిలోలకు పెరిగాయని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నెలకు 2,000 కిలోల లడ్డూలు అమ్ముడవుతున్నాయని, అవి ‘ఆదివాసీ ఆహారం’ పథకంలో భాగంగా 60 హాస్టళ్లకు చేరుతున్నాయన్నారు. ఈ లడ్డూలు ఆదివాసీ మహిళలకు నిలకడైన ఆదాయం, గౌరవాన్ని అందిస్తున్నాయని తెలిపారు.
News October 11, 2025
కామారెడ్డి: ‘కల్లుగీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి’

కల్లుగీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘ అధ్యక్షుడు వెంకట రమణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి పానీయమైన నీరా, కల్లును ఎందుకు ప్రోత్సహించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
News October 11, 2025
రేపు ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ CLSకు శంకుస్థాపన

AP: మంత్రి నారా లోకేశ్ రేపు విశాఖలో సిఫీ(Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన చేయనున్నారు. సిఫీ రూ.1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఇండియాతో పాటు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ CLS వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్‌గా పనిచేయనుంది.