News October 11, 2025

రాబోయే 2-3 గంటల్లో వర్షం

image

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ వీటితో పాటు నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని పేర్కొంది. .

Similar News

News October 11, 2025

Alert: గూగుల్ పే చేస్తున్నారా?

image

గూగుల్ పే ఇప్పటిదాకా ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) సిస్టమ్‌లో చేరలేదని టెలికం శాఖ సెక్రటరీ నీరజ్ మిత్తల్ వెల్లడించారు. ఆ సంస్థ నుంచి జరిగే లావాదేవీలకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదని చెప్పారు. దేశంలో UPI పేమెంట్లలో 30-35% Google Pay ద్వారానే జరుగుతున్నాయని, దీంతో మూడో వంతు చెల్లింపులు సురక్షితం కాదని DoT అధికారి ఒకరు చెప్పారు. యూపీఐ పేమెంట్ చేసే టైమ్‌లో ఆర్థిక మోసం జరిగే అవకాశం ఉంటే FRI హెచ్చరిస్తుంది.

News October 11, 2025

మహిళలూ ఆధార్‌లో ఇంటిపేరు ఇలా మార్చుకోండి

image

వివాహం తర్వాత మహిళలు తమ ఇంటిపేరును మార్చుకుంటారు. అయితే ఆధార్‌కార్డులో కూడా ఈ వివరాలు మార్చాల్సి ఉంటుంది. దీనికోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్ ఫారం తీసుకొని వివరాలు పూరించాలి. దానికోసం మ్యారేజ్ సర్టిఫికేట్, అఫిడవిట్ వంటి పత్రాలు ఇవ్వాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసి URN నంబర్ ఇస్తారు. అప్డేట్ అయిన తర్వాత కొత్త ఆధార్‌ను UIDAI వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News October 11, 2025

ఇదేందయ్యా ఇది.. 100కు 137 మార్కులా?

image

రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని MBM ఇంజినీరింగ్ వర్సిటీలో BE II సెమిస్టర్ విద్యార్థులకు ఊహించని పరిణామం ఎదురైంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 100 మార్కులకు ఏకంగా 103 నుంచి 137 రావడంతో అవాక్కయ్యారు. విషయం కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో మార్కులను వెబ్‌సైట్ నుంచి తొలగించారు. టెక్నికల్ తప్పిదం వల్ల ఇలా జరిగినట్లు ఎగ్జామ్ కంట్రోలర్ అనిల్ గుప్తా తెలిపారు. త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.