News October 11, 2025
ఈ నెల 14న తెలంగాణ బంద్: R.కృష్ణయ్య

TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఈ బంద్‌కు సీఎం రేవంత్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టే ఇవ్వడం దుర్మార్గమని, మిలియన్ మార్చ్ తరహాలో బీసీ ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్తామని నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
Similar News
News October 11, 2025
AIతో ‘కరెంట్ షాక్’!

భారత్ సహా ప్రపంచ దేశాలు AI వెంట పరిగెడుతున్నాయి. టెక్నాలజీ అవసరమైనా దాని వల్ల ఎలక్ట్రిసిటీ రూపంలో ఓ పెద్ద సమస్య ఉత్పన్నం కానుందనే చర్చ మొదలైంది. AI డేటా సెంటర్ల నిర్వహణకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం అవుతుంది. ఫలితంగా కరెంట్‌కు డిమాండ్ పెరిగి విద్యుత్ ఛార్జీలతో పాటు పవర్ కట్‌లు పెరుగుతాయని జోహో ఫౌండర్ శ్రీధర్ పేర్కొన్నారు. 2023 నుంచి ఏథెన్స్, జార్జియాలో 60% ఛార్జీలు పెరిగిన విషయాన్ని ఉదహరించారు.
News October 11, 2025
Alert: గూగుల్ పే చేస్తున్నారా?

గూగుల్ పే ఇప్పటిదాకా ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) సిస్టమ్‌లో చేరలేదని టెలికం శాఖ సెక్రటరీ నీరజ్ మిత్తల్ వెల్లడించారు. ఆ సంస్థ నుంచి జరిగే లావాదేవీలకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదని చెప్పారు. దేశంలో UPI పేమెంట్లలో 30-35% Google Pay ద్వారానే జరుగుతున్నాయని, దీంతో మూడో వంతు చెల్లింపులు సురక్షితం కాదని DoT అధికారి ఒకరు చెప్పారు. యూపీఐ పేమెంట్ చేసే టైమ్‌లో ఆర్థిక మోసం జరిగే అవకాశం ఉంటే FRI హెచ్చరిస్తుంది.
News October 11, 2025
మహిళలూ ఆధార్‌లో ఇంటిపేరు ఇలా మార్చుకోండి

వివాహం తర్వాత మహిళలు తమ ఇంటిపేరును మార్చుకుంటారు. అయితే ఆధార్‌కార్డులో కూడా ఈ వివరాలు మార్చాల్సి ఉంటుంది. దీనికోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్ ఫారం తీసుకొని వివరాలు పూరించాలి. దానికోసం మ్యారేజ్ సర్టిఫికేట్, అఫిడవిట్ వంటి పత్రాలు ఇవ్వాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసి URN నంబర్ ఇస్తారు. అప్డేట్ అయిన తర్వాత కొత్త ఆధార్‌ను UIDAI వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.