News October 11, 2025

ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్యాయత్నం

image

ములకలచెరువు(M)నికి చెందిన ఓ యువకుడు ప్రియురాలు మోసం చేసిందని విషం తాగి తాగాడు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని బురకాయలకోటకు చెందిన గణేష్ స్థానికంగా ఉండే టోల్ గేట్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉండటమే కాకుండా పెళ్లికి నిరాకరించిందని ఆయన మనస్తాపం చెందాడు. ఆ బాధతో విషం తాగగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు.

Similar News

News October 11, 2025

వంటింటి చిట్కాలు

image

☛ క్యాబేజీ వాసన రాకుండా ఉండాలంటే వండేటప్పుడు అందులో చిన్న అల్లంముక్క వేయాలి.
☛ కూరల్లో ఉప్పు ఎక్కువైతే కాస్త మీగడ కలిపితే చాలా రుచిగా ఉంటుంది.
☛ పూరీపిండిలో కొంచెం చక్కెర కలిపితే పూరీలు చాలాసేపటి వరకు తాజాగా ఉంటాయి.
☛ కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు పోవడంతో పాటు కూర రుచిగా ఉంటుంది.
☛ అప్పడాలను వేయించే ముందు కాసేపు ఎండలో ఉంచితే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. <<-se>>#VantintiChitkalu<<>>

News October 11, 2025

వర్మ.. HYDకు రంజీ ‘తిలకం’ దిద్దు!

image

రంజీ ట్రోఫీ.. దేశంలో 90 సార్లు జరిగిన క్రికెట్ సంగ్రామం. ఈ దేశవాలీ క్రికెట్‌లో HYD జట్టు కేవలం 2 టైటిళ్లు మాత్రమే గెలిచింది. మరో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. నాలుగు దశబ్దాలుగా రంజీ ట్రోఫీని HYD కైవసం చేసుకోలేకపోయింది. OCT 15 నుంచి 2025-26 సీజన్ ప్రారంభంకానుంది. ఈసారి హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ ఉండడంతో అభిమానుల్లో హోప్స్ పెరిగాయి. ఈ సీజన్‌లోనైనా <<17955623>>విజయ తిలకం<<>> దిద్దాలని ఫ్యాన్స్ కోరిక.

News October 11, 2025

కాట్రేనికోన: పెళ్లి ఇంట విషాదం

image

కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో శనివారం పెళ్లి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అన్న కుమారుడి వివాహం సందర్భంగా మల్లాడి భాగ్యరాజ్ మోటార్‌సైకిల్‌పై పెళ్లి కుమార్తె ఇంటికి (అయినాపురం) బయలుదేరాడు. నీళ్లరేవు నుంచి కొబ్బరికాయల లోడుతో వస్తున్న ట్రాక్టర్ వెనుక నుంచి అతన్ని ఢీకొట్టింది. ఘటనలో భాగ్యరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.