News October 11, 2025

మెడికల్ కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీహరి రావు తెలిపారు. DMLT కోర్సులో 30 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇంటర్‌లో బైపీసీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 28వ తేదీ లోపు కళాశాలలో అప్లై చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు http://gmckothagudem.org వెబ్ సైట్‌ను సందర్శించాలని కోరారు.

Similar News

News October 11, 2025

పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు

image

పిచికారీకి ముందు పురుగు మందు డబ్బాలపై సూచనలను తప్పక చదవాలి. ఇంటి పరిసరాలకు, చిన్న పిల్లలకు, పశువులకు పురుగు మందు డబ్బాలను దూరంగా ఉంచాలి. ఎండగా ఉన్నప్పుడే పురుగు మందులను పిచికారీ చేయాలి. పిచికారీ సమయంలో తప్పనిసరిగా చేతికి గ్లౌజ్, ముఖానికి మాస్క్, టోపీ, ఆప్రాన్ లాంటి శరీరమంతా కప్పుకునే బట్టలు వేసుకోవాలి. గాలి వీచే దిశలో మాత్రమే పిచికారీ చేయాలి. వర్షం పడేలా ఉంటే పురుగు మందులను పిచికారీ చేయకూడదు.

News October 11, 2025

విభజించు పాలించు విధానంలో HMDA ప్రణాళిక

image

HMDA ప్రాంతాన్ని మొత్తం 16 డివిజన్లుగా విభజించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని పాటించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. HMDA 10, 472 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరణకు ప్రణాళిక రచిస్తున్న అధికారులు, ముందు చూపుతో ప్రత్యేక జోనింగ్ సిస్టం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫొటోస్ పెట్టినట్లు పేర్కొంది.

News October 11, 2025

HYD: నేరగాళ్ల చేతిలో చదువుకున్నోళ్లే మోసపోతున్నారు!

image

సైబర్ మోసాల్లో చదువుకున్నవారే అత్యధికంగా మోసపోతున్న పరిస్థితి ఉందని NCRB తెలిపింది. సైబర్ మోసాల్లో 60 శాతం మంది ఐటీ ఉద్యోగులు, నిపుణులు బాధితులుగా ఉంటున్నారు. మరోవైపు 30 శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు, 10% మంది ఇతరులు ఉన్నట్లుగా గుణాంకాలు చెబుతున్నాయి. NCRB గుణాంకాల ప్రకారం HYD లాంటి నగరాల్లో ఈ పరిస్థితి ఉందని తెలిపింది.