News October 11, 2025

HYDలో రోజుకు ఐదుగురి ప్రాణాలు పోతున్నాయ్..!

image

HYDలో రోజుకు 31 చొప్పున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రతిరోజు కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మృతుల్లో ఎక్కువగా బైకర్లు, పాదచారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ORRపై 2024లో జరిగిన ప్రమాదాల్లో రాచకొండ పరిధిలో 19 మంది, సైబరాబాద్ పరిధిలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

Similar News

News October 11, 2025

విభజించు పాలించు విధానంలో HMDA ప్రణాళిక

image

HMDA ప్రాంతాన్ని మొత్తం 16 డివిజన్లుగా విభజించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని పాటించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. HMDA 10, 472 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరణకు ప్రణాళిక రచిస్తున్న అధికారులు, ముందు చూపుతో ప్రత్యేక జోనింగ్ సిస్టం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫొటోస్ పెట్టినట్లు పేర్కొంది.

News October 11, 2025

HYD: నేరగాళ్ల చేతిలో చదువుకున్నోళ్లే మోసపోతున్నారు!

image

సైబర్ మోసాల్లో చదువుకున్నవారే అత్యధికంగా మోసపోతున్న పరిస్థితి ఉందని NCRB తెలిపింది. సైబర్ మోసాల్లో 60 శాతం మంది ఐటీ ఉద్యోగులు, నిపుణులు బాధితులుగా ఉంటున్నారు. మరోవైపు 30 శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు, 10% మంది ఇతరులు ఉన్నట్లుగా గుణాంకాలు చెబుతున్నాయి. NCRB గుణాంకాల ప్రకారం HYD లాంటి నగరాల్లో ఈ పరిస్థితి ఉందని తెలిపింది.

News October 11, 2025

కాశీ సందర్శనకు తరలి వస్తున్న విదేశీయులు

image

పరమ పవిత్ర కాశీ నగరానికి విదేశీ భక్తులు తరలివస్తున్నారు. 2021లో కేవలం 2,566 మంది విదేశీయులు మాత్రమే కాశీని సందర్శించారు. ఆ సంఖ్య 2024 నాటికి 2.1 లక్షలకు పెరిగింది. 2025 జూన్ నెలలోనే 1.88 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది పురాతన ఆలయాల గొప్పదనం విశ్వ నలుమూలలకు విస్తరిస్తోందని చెప్పడానికి సంకేతం. విదేశీయులు సైతం కాశీకి రావడం భారత ఆధ్యాత్మిక వారసత్వ విజయానికి నిదర్శనం!