News October 11, 2025
స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.. మెనూ ఇదే?

TG: వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో ‘బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్ అమలు చేస్తామని CM రేవంత్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. స్కూళ్లు రీఓపెన్ అయ్యే రోజు (జూన్ 12) నుంచే విద్యార్థులకు అల్పాహారం అందించే అవకాశం ఉంది. ఇప్పటికే మెనూ ఖరారైనట్లు తెలుస్తోంది. 3 రోజులు రైస్ ఐటమ్స్ (పొంగల్, కిచిడీ, జీరారైస్), 2 రోజులు రవ్వ ఐటమ్స్ (గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ), ఒక రోజు బోండా ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News October 11, 2025
పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు

పిచికారీకి ముందు పురుగు మందు డబ్బాలపై సూచనలను తప్పక చదవాలి. ఇంటి పరిసరాలకు, చిన్న పిల్లలకు, పశువులకు పురుగు మందు డబ్బాలను దూరంగా ఉంచాలి. ఎండగా ఉన్నప్పుడే పురుగు మందులను పిచికారీ చేయాలి. పిచికారీ సమయంలో తప్పనిసరిగా చేతికి గ్లౌజ్, ముఖానికి మాస్క్, టోపీ, ఆప్రాన్ లాంటి శరీరమంతా కప్పుకునే బట్టలు వేసుకోవాలి. గాలి వీచే దిశలో మాత్రమే పిచికారీ చేయాలి. వర్షం పడేలా ఉంటే పురుగు మందులను పిచికారీ చేయకూడదు.
News October 11, 2025
కాశీ సందర్శనకు తరలి వస్తున్న విదేశీయులు

పరమ పవిత్ర కాశీ నగరానికి విదేశీ భక్తులు తరలివస్తున్నారు. 2021లో కేవలం 2,566 మంది విదేశీయులు మాత్రమే కాశీని సందర్శించారు. ఆ సంఖ్య 2024 నాటికి 2.1 లక్షలకు పెరిగింది. 2025 జూన్ నెలలోనే 1.88 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది పురాతన ఆలయాల గొప్పదనం విశ్వ నలుమూలలకు విస్తరిస్తోందని చెప్పడానికి సంకేతం. విదేశీయులు సైతం కాశీకి రావడం భారత ఆధ్యాత్మిక వారసత్వ విజయానికి నిదర్శనం!
News October 11, 2025
ట్రంప్‌ది ఉరకలేసే హృదయం

అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన అత్యంత వృద్ధుల్లో డొనాల్డ్ ట్రంప్ ఒకరు. రెండోసారి బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన వయసు 79 ఏళ్లు. కానీ ఆయన హృదయం మాత్రం 14 ఏళ్ల చిన్నదేనట. ట్రంప్ వైద్య పరీక్షల నివేదికను వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విడుదల చేశారు. ఆయన గుండె, శరీరం వాస్తవ వయసుకన్నా తక్కువ ఉన్నట్లు డాక్టర్ల పరీక్షల్లో తేలిందన్నారు. ఊపిరితిత్తులు, నాడులు, ఇతర అవయవాల పనితీరు అద్భుతంగా ఉన్నట్లు చెప్పారు.