News October 11, 2025

భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

image

హీరోయిన్ దీపికా పదుకొణె భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. నిన్న వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. హెల్త్ మినిస్టర్ నడ్డాతో భేటీ అయిన ఫొటోలను దీపిక SMలో పోస్ట్ చేశారు. ఈ బాధ్యతలు తీసుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, టెలీ మానస్ వంటి స్కీమ్‌లను ప్రమోట్ చేయడంలో ఆమె కేంద్రంతో కలిసి పనిచేస్తారు.

Similar News

News October 11, 2025

Shutdown effect: USలో వేలాది మంది ఉద్యోగుల తొలగింపు

image

US ప్రభుత్వం షట్‌డౌన్ వ్యవహారం తీవ్రంగా మారుతోంది. ట్రంప్ యంత్రాంగం వేలాది మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. డెమోక్రాట్లపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్యలకు దిగింది. లేఆఫ్‌లు స్టార్ట్ అయ్యాయని వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ రస్సెల్ తెలిపారు. 7 ఏజెన్సీలు 4వేల మందికి పైగా వర్కర్ల తొలగింపును స్టార్ట్ చేసినట్లు సమాచారం. కాగా కొత్త బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో షట్‌డౌన్ అమల్లోకొచ్చింది.

News October 11, 2025

పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు

image

పిచికారీకి ముందు పురుగు మందు డబ్బాలపై సూచనలను తప్పక చదవాలి. ఇంటి పరిసరాలకు, చిన్న పిల్లలకు, పశువులకు పురుగు మందు డబ్బాలను దూరంగా ఉంచాలి. ఎండగా ఉన్నప్పుడే పురుగు మందులను పిచికారీ చేయాలి. పిచికారీ సమయంలో తప్పనిసరిగా చేతికి గ్లౌజ్, ముఖానికి మాస్క్, టోపీ, ఆప్రాన్ లాంటి శరీరమంతా కప్పుకునే బట్టలు వేసుకోవాలి. గాలి వీచే దిశలో మాత్రమే పిచికారీ చేయాలి. వర్షం పడేలా ఉంటే పురుగు మందులను పిచికారీ చేయకూడదు.

News October 11, 2025

కాశీ సందర్శనకు తరలి వస్తున్న విదేశీయులు

image

పరమ పవిత్ర కాశీ నగరానికి విదేశీ భక్తులు తరలివస్తున్నారు. 2021లో కేవలం 2,566 మంది విదేశీయులు మాత్రమే కాశీని సందర్శించారు. ఆ సంఖ్య 2024 నాటికి 2.1 లక్షలకు పెరిగింది. 2025 జూన్ నెలలోనే 1.88 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది పురాతన ఆలయాల గొప్పదనం విశ్వ నలుమూలలకు విస్తరిస్తోందని చెప్పడానికి సంకేతం. విదేశీయులు సైతం కాశీకి రావడం భారత ఆధ్యాత్మిక వారసత్వ విజయానికి నిదర్శనం!