News October 11, 2025
WGL: గాడి తప్పుతున్న ఖాకీలు..!

పోలీసు స్టేషన్లు MLAల అడ్డాగా మారిపోయాయా అంటే అవుననే తరహాలో ఘటనలు ఓరుగల్లులో చోటు చేసుకుంటున్నాయి. ఇక MLAల పేరు చెప్పి చోటా మోటా నాయకులు తమకు ఎదురు తిరిగిన వారిని పోలీసుల ఎదుటే కొట్టే స్థాయికి వెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందో నిన్నటి కేయూ పీఎస్ ఘటనే సాక్ష్యంగా నిలిచింది.పోలీసుల ఎదుటే బాధితుడిపై ఓ కాంగ్రెస్ నేత చేయి చేసుకోవడం కలకలం సృష్టించింది. సీసీ కెమెరాల్లో రికార్డైనా కేసు పెట్టనట్టు తెలుస్తోంది.
Similar News
News October 11, 2025
పట్టుకుంటే రూ.పది లక్షలు: రాచమల్లు

అసలుకు నకిలీకి ఏ మాత్రం తేడా లేకుండా పచ్చ బ్యాచ్ నకిలీ మద్యం మార్కెట్లోకి తీసుకువచ్చారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆయన శనివారం పొద్దుటూరులో మద్యం బాటిళ్లు తీసుకుని సమావేశం నిర్వహించారు. ఇందులో అసలు ఏదో, నకిలీ ఏదో పట్టుకుంటే రూ.పది లక్షలు ఇస్తామని సవాల్ చేశారు. బాటిళ్లు, లేబుళ్లు, మూతలు, క్యూఆర్ కోడ్ ఏ మాత్రం తేడా లేకుండా నకిలీ తీసుకువచ్చారన్నారు.
News October 11, 2025
నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు

AP: CM CBN సతీమణి, NTR ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కి ఎంపికయ్యారు. అపార వ్యాపార నాయకత్వం, వివిధ రంగాల్లో చేసిన సేవలకు గాను IOD ఈ అవార్డు ప్రకటించింది. లండన్లో నవంబర్ 4న జరిగే గ్లోబల్ కన్వెన్షన్లో ఈ అవార్డును ఆమె స్వీకరించనున్నారు. గతంలో ఏపీజే అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా, సంజీవ్ గోయెంకా వంటి ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
News October 11, 2025
ఇతిహాసాలు క్విజ్ – 32 సమాధానాలు

1. రావణుడి రెండో భార్య ‘ధాన్యమాలిని’.
2. ద్రౌపది అన్న ధృష్టద్యుమ్నుడు.
3. అయ్యప్ప స్వామి వాహనం ‘పెద్ద పులి’.
4. విష్ణుమూర్తి ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించాడు.
5. అహం అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ‘నేను’.
<<-se>>#Ithihasaluquiz<<>>