News October 11, 2025
ములుగు వైపు అందరి చూపు..!

కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు ములుగులో హీటెక్కిస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పీఠం కోసం మంత్రి సీతక్కకు చెమటలు పట్టేలా చేస్తున్నాయి.డీసీసీ కోసం కుమారుడు కుంజ సూర్య ఆశిస్తుండగా, మరోపక్క తన అనుచరుడిగా ఉన్న పైడాకుల అశోక్ సైతం మరోమారు పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ZPTC స్థానం రిజర్వు విషయంలో నొచ్చుకున్న అనుచరుడు, డీసీసీ విషయంలో మంత్రి కుమారుడు పోటీ పడుతుండడంతో ఏం జరగనుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News October 11, 2025
అల్లూరి: ‘క్లాప్ కార్మికులకు రక్షణ పరికరాలు అందజేయాలి’

అల్లూరి జిల్లాలోని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులకు రక్షణ వస్తువులు మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకట్ కోరారు. మారేడుమిల్లిలో క్లాప్ కార్మికుల సమస్యలను శనివారం ఆయన అడిగి తెలుసుకున్నారు. బూట్లు, గ్లౌజ్‌లు, యూనిఫామ్, మాస్క్‌లు ప్రభుత్వం ఇవ్వలన్నారు. కనీస వేతనం రూ. 12,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. చాలి చాలి వేతనాలతో కార్మికులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.
News October 11, 2025
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ADB SP

సైబర్ నేరాల పట్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సూచించారు. డబ్బుపై అత్యాశతో, ఉద్యోగంపై ఆసక్తితో లేదా తక్కువ సమయంలో లోను వస్తుందని సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రజలు మోసపోతున్నారని వివరించారు. ఆర్థిక నేరం, సోషల్ మీడియా నేరం, యూపీఐ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్ వంటి మోసాలకు గురైతే వెంటనే 1930కి సంప్రదించాలన్నారు. ఈ వారం జిల్లాలో 11 సైబర్ ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు.
News October 11, 2025
175 వద్ద రనౌట్.. జైస్వాల్ ఏమన్నారంటే?

WIతో జరుగుతున్న 2వ టెస్టులో 175 రన్స్ వద్ద ఔటవ్వడంపై జైస్వాల్ స్పందించారు. ఇది ఆటలో భాగమేనని తెలిపారు. తానెప్పుడూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ గేమ్‌ను వీలైనంత ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తానన్నారు. బంతి మూవ్ అయిన టైంలో గంటసేపు క్రీజులో ఉండగలిగితే ఈజీగా రన్స్ చేయగలనని అనుకున్నట్లు వివరించారు. ఇప్పటికీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నారు.