News October 11, 2025
ప్రొద్దుటూరులో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ప్రొద్దుటూరు: స్థానిక జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి షేక్ మున్నా(19) అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు 1టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మున్నా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
Similar News
News October 11, 2025
పట్టుకుంటే రూ.పది లక్షలు: రాచమల్లు

అసలుకు నకిలీకి ఏ మాత్రం తేడా లేకుండా పచ్చ బ్యాచ్ నకిలీ మద్యం మార్కెట్లోకి తీసుకువచ్చారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆయన శనివారం పొద్దుటూరులో మద్యం బాటిళ్లు తీసుకుని సమావేశం నిర్వహించారు. ఇందులో అసలు ఏదో, నకిలీ ఏదో పట్టుకుంటే రూ.పది లక్షలు ఇస్తామని సవాల్ చేశారు. బాటిళ్లు, లేబుళ్లు, మూతలు, క్యూఆర్ కోడ్ ఏ మాత్రం తేడా లేకుండా నకిలీ తీసుకువచ్చారన్నారు.
News October 11, 2025
ఖాజీపేట: స్వగ్రామానికి చేరిన చిన్నారి మృతదేహం

ఖాజీపేట(M) గుత్తి కొట్టలు గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి కుటుంబం వృత్తిరీత్యా జర్మనీలో స్థిరపడింది. నాగేశ్వర్ రెడ్డి కుమార్తె బేబీ చేతన (15) అక్కడ 9వ తరగతి చదువుతోంది. రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై మృతి చెందింది. ఆ చిన్నారి మృతదేహం స్వగ్రామానికి శనివారం చేరుకుంది. చిన్నారి మృతి పట్ల గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి మృతి బాధాకరమన్నారు.
News October 11, 2025
ప్రొద్దుటూరులో మట్కా బీటర్లు అరెస్ట్

ప్రొద్దుటూరు 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా జూదం ఆడుతున్నవారిని శుక్రవారం అరెస్ట్ చేసి వారినుంచి రూ.10,170లు స్వాదీనం చేసుకున్నట్లు సీఐ సదాశివయ్య తెలిపారు. తమకు రాబడిన సమాచారం మేరకు మట్కా ఆడుతున్న శ్రీనివాస నగర్‌కు చెందిన షేక్ గఫార్, కరీముల్లా, నాయబ్, రఘు, సన్న ముత్యాలు, నీలాధర్, సయ్యద్ ఖాజా, సుబ్బయ్యలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాల సమాచారం ఇవ్వాలని ప్రజలను సీఐ కోరారు.