News October 11, 2025
ఉత్తరాంధ్రలో అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: చంద్రబాబు

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రలో చేపడతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమవుతున్నామని CM చంద్రబాబు వ్యాఖ్యనించారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు స్టీల్‌ప్లాంట్ మూతపడకుండా కాపాడామన్నారు. ముఖ్యంగా IT కంపెనీల స్థాపన, గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ వంటి కీలక ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులను ఆదేశించారు.
Similar News
News October 11, 2025
తిరుపతి: మురికి కాలువలో 6 నెలల చిన్నారి

తిరుపతి సింగాలగుంట మసీదు వీధిలో శనివారం విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 6 నెలల చిన్నారిని మురికి కాలువలో స్థానికులు గుర్తించారు. వెంటనే సానిటరీ సిబ్బందికి అలాగే వీఆర్వోకి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని చిన్నారిని బయటికి తీశారు. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా.. కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 11, 2025
చేపల వినియోగం పెంపునకు ప్రాధాన్యం: మంత్రి టీజీ భరత్

చేపల వినియోగం పెంచేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. శనివారం నన్నూరు టోల్‌గేట్ వద్ద పాణ్యం ఎమ్మెల్యే చరిత, కలెక్టర్ డా.ఏ.సిరితో కలిసి చేపల విలువ ఆధారిత యూనిట్‌ను ప్రారంభించారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని ఆయన చెప్పారు. రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో 60శాతం సబ్సిడీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
News October 11, 2025
మద్యం కేసు నిందితులందర్నీ అరెస్టు చేస్తాం: మంత్రి కొల్లు

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించామని, వారిలో 14 మందిని అరెస్టు చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏ1గా ఉన్న జనార్దనావును కస్టడీలోకి తీసుకున్నామని, నాలుగు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుతోపాటు ఏపీలోనూ దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. త్వరలో APTATS యాప్ ద్వారా మద్యం బాటిళ్ల వివరాలు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.