News October 11, 2025

కరీంనగర్: డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తుల స్వీకరణ

image

పార్టీ సంస్థాగత నిర్మాణ పటిష్టత కోసం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి 18వ తేదీ వరకు ఆశావాహుల నుంచి ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పార్టీకి చేసిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతల వివరాలతో కూడిన బయోడేటాను దరఖాస్తుదారులు స్థానిక జిల్లా అధ్యక్షులకు అందజేయాలని సూచించారు. నవంబర్ మొదటి వారంలో అధిష్టానం అధ్యక్షులను ప్రకటిస్తుంది.

Similar News

News October 11, 2025

ఒంగోలు నుంచి పాకల బీచ్‌కు ఫ్రీ బస్సు

image

ఒంగోలు డిపో నుంచి ప్రతి ఆదివారం పాకల బీచ్‌కి స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సులు ప్రత్యేకంగా నడపనున్నట్లు ఒంగోలు RTC డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు, యాత్రికులు ఈ సర్వీస్‌ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఆదివారం పాకల బీచ్‌కు వచ్చే సందర్శకులకు ఇదొక మంచి సదవకాశంగా చెప్పవచ్చు.

News October 11, 2025

HNK: ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం..!

image

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి(M) గోపాలపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కీర్తన ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్సై ప్రవీణ్ వివరాల ప్రకారం.. ఈనెల 10న ఎవరూ లేని సమయంలో కీర్తన ఉరి వేసుకొని బలవర్మరణానికి పాల్పడింది. తండ్రి కృష్ణకర్ ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, కీర్తన జేఎన్టీయూలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది.

News October 11, 2025

డీప్ ఫేక్ వీడియోలతో మోసం: దేవినేని

image

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోషల్ మీడియాలో ఏఐ వీడియో ద్వారా జరుగుతున్న మోసాలపై
X వేదికగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది సైబర్ నేరగాళ్లు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫేక్ ఆడియో వీడియో కాల్స్ చేస్తున్నారన్నారు. ఏఐ సహాయంతో డీప్ ఫేక్ వీడియోలతో మోసం చేస్తున్నారని చెప్పారు. సైబర్ మోసాలపై విజయవాడ పోలీస్ కమిషనర్ తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.