News October 11, 2025

మావోయిస్టుల కొత్త దళపతి దేవ్‌జీ కాదా?

image

మావోయిస్టుల సారథి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణించాక కొత్త చీఫ్ ఎవరనే దానిపై గందరగోళం నెలకొంది. జగిత్యాల (TG) జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని నియమించారని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ దళానికి సెక్రటరీని ఇంకా నియమించలేదని, పార్టీలో విభేదాలున్నాయని లొంగిపోయిన మావోలు చెప్పడం గమనార్హం. కీలక నేతల లొంగుబాటు, మల్లోజుల లేఖల నేపథ్యంలో పార్టీ దళపతిగా ఎవరొస్తారనేది కీలకంగా మారింది.

Similar News

News October 11, 2025

బొత్సకు వైసీపీ నుంచే ప్రాణహాని: పల్లా

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ <<17973709>>బొత్స<<>> సత్యనారాయణకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని TDP చీఫ్‌ పల్లా శ్రీనివాస్‌ అన్నారు. ఆయనకు సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చని కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్‌ నుంచి ప్రాణహాని ఉండొచ్చని పేర్కొన్నారు. బొత్స భద్రత కావాలని కోరితే CM నిర్ణయం తీసుకుంటారన్నారు.

News October 11, 2025

విద్యార్థినిపై అత్యాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు

image

ఒడిశా విద్యార్థినిపై <<17976156>>అత్యాచారం <<>> కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ విచారం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని WB సీఎం మమతను కోరారు.

News October 11, 2025

పాత ఫోన్‌ను అమ్ముతున్నారా? చిక్కుల్లో పడ్డట్లే!

image

పాత ఫోన్లకు ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు ఇస్తామంటూ వీధుల్లోకి వచ్చే వారికి మొబైళ్లను అమ్మారో మీరు చిక్కుల్లో పడ్డట్లే. ఆ ఫోన్లను వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఫోన్ల నుంచి ఇతరులకు ఓటీపీలు, మెసేజ్‌లు పంపి వారి BANK ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. ఇవి అమ్మిన వారి పేరిట ఉండడంతో తప్పించుకుంటున్నారు. కాగా ఇలాంటి మరో ముఠా దుమ్ముగూడెం పోలీసులకు చిక్కింది.